తనను ఏడిపించిన కన్నాకు సపోర్ట్ చేస్తానంటున్న రాయపాటి రాజకీయం అందుకేనా!!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, అప్పటివరకు శత్రువులుగా ఉన్నవారు మిత్రులు కావటం రాజకీయాల్లో సాధ్యమే. తాజాగా పల్నాడు జిల్లా టిడిపి రాజకీయాలపై టిడిపి సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కన్నా లక్ష్మీనారాయణ విషయంలోనూ ఆయన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.
రాయపాటి సాంబశివరావు తన చిరకాల ప్రత్యర్థి అయిన కన్నా లక్ష్మీనారాయణ పైన కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కన్నా లక్ష్మీనారాయణ కు ఎక్కడ టికెట్ ఇచ్చినా గెలుస్తారని, తాను ఆయనకు పూర్తిగా మద్దతు ఇస్తానని పేర్కొన్నారు. కన్నా లక్ష్మీనారాయణ తో ఇప్పటికీ తాను రాజీ పడలేదని, కానీ చంద్రబాబు కోసం పార్టీ కోసం పని చేస్తానని రాయపాటి సాంబశివ రావు చెప్పుకొచ్చారు.

10సంవత్సరాల పాటు కన్నా లక్ష్మీనారాయణ తనను, చంద్రబాబును ఏడిపించారని, ఆ తరువాత కోర్టులో రాజీ పడ్డారని రాయపాటి వెల్లడించారు. ఏది ఏమైనా చంద్రబాబు మాటే తనకు వేదం అన్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి మాట్లాడిన ఆయన వచ్చే ఎన్నికల్లో తనకు నరసరావుపేట నుండి టికెట్ ఇస్తే, చంద్రబాబు ఆదేశిస్తే పోటీ చేస్తానన్నారు. గతంలో తన వద్ద డబ్బులు లేక ఓడిపోయానని ఇప్పుడు తనవద్ద డబ్బులు ఉన్నాయని రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించారు.
అంతేకాదు ఈ సారి డబ్బులు ఉన్నా లేకున్నా టిడిపి వేవ్ పక్కా అంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరసరావుపేట టికెట్ విషయంలో మాట్లాడిన ఆయన, నరసరావుపేటలో స్థానికులకు అవకాశం ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తనకు వయసుపైబడిన మాట వాస్తవమే అయినప్పటికీ, కానీ అన్ని చోట్ల తిరుగుతారని, కీలకంగా పని చేస్తానని పేర్కొన్నారు. తాను చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తానని పేర్కొన్న రాయపాటి చంద్రబాబుపై తన విధేయతను చూపించారు.
తాను ఎవరినీ వ్యతిరేకించనని, ఏ ఇంచార్జికి తాను వ్యతిరేకం కాదని తెలిపారు. ఇక మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి విజయం సాధిస్తారని పేర్కొన్నారు. గురజాల టికెట్ విషయంలోనూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాయపాటి గురజాలలో అవినీతి రహితంగా ఉండే వ్యక్తులకు టిక్కెట్ ఇవ్వాలని కోరారు. తన తనయుడు రంగబాబుకు కూడా సీటు ఇమ్మని కోరుతున్నామని, రంగబాబుకు సత్తెనపల్లి ఇస్తారా? పెదకూరపాడు ఇస్తారా? అన్నది చంద్రబాబు నిర్ణయం అని స్పష్టం చేశారు.
-
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!











Click it and Unblock the Notifications