కన్నా టీడీపీలోకి వస్తే ఏం చేయాలో తెలుసు - రాయపాటి సంచలనం..!!

కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరికపైన రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేసారు.

మాజీ ఎంపీ..టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలోకి ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. కన్నా టీడీపీలోకి వస్తారనే వార్తల పైన రాయపాటి సాంబశివరావు స్పందించారు. అదే సమయంలో టీడీపీ - జనసేన పొత్తు పైనా కీలక వ్యాఖ్యలు చేసారు. గుంటూరు జిల్లాలో సుదీర్ఘ కాలంగా ఒకే పార్టీలో ఉన్నా కన్నా - రాయపాటి రాజకీయంగా ఎవరి దారి వారిదే.

కొద్ది రోజుల క్రితం తన కుమారుడికి సీటు ఇవ్వటం పైన పార్టీ నాయకత్వానికి అల్టిమేటం ఇచ్చిన రాయపాటి ఇప్పుడు కన్నా టీడీపీలోకి ఎంట్రీ పైన ఒక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు రాయపాటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కన్నా టీడీపీలోకి ఎలా వస్తారు

కన్నా టీడీపీలోకి ఎలా వస్తారు

బీజేపీకి రాజీనామా చేసిన కన్నా టీడీపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. ఈ మేరకు ఇప్పటికే టీడీపీ అధినాయకత్వంతో చర్చలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 23 లేదా 24 తేదీల్లో టీడీపీలో చేరుతారని చెబుతున్నారు. ఈ సమయంలో గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఒకే పార్టీలో ఉన్న భిన్నవర్గాలుగా ఉన్న రాయపాటి -కన్నా వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది. టీడీపీలో ఎంపీగా పని చేసిన రాయపాటి ఇప్పుడు కన్నా టీడీపీలో చేరే అంశం పైన స్పందించారు.

కన్నా టీడీపీలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలోకి వస్తే ఏం చేయాలో తనకు తెలుసంటూ వ్యాఖ్యానించారు. తనను.. పార్టీ అధినేత చంద్రబాబు ను తిట్టారని.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని రాయపాటి ప్రశ్నించారు. తనకు తాను పులిని అని చెప్పుకొనే కన్నా..ఎన్నికల్లో ఎలా ఓడిపోయారని వ్యాఖ్యానించారు.

కన్నా ప్రతాపం ఏంటో తెలుస్తుంది

కన్నా ప్రతాపం ఏంటో తెలుస్తుంది

కన్నా పెదకూరపాడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంతో తాను గుంటూరు ఎంపీగా బరిలో నిలిచిన అంశాన్ని రాయపాటి గుర్తు చేసారు. కన్నా కంటే తనకు ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. తాను ప్రచారానికి వెళ్లకపోయినా ఎక్కువ ఓట్లు వచ్చాయని వివరించారు. వచ్చే ఎన్నికల్లో కన్నా ప్రతాపం ఏంటో తెలుస్తుందని పేర్కొన్నారు. కన్నా జనసేనలోకి వెళ్తారని రాయపాటి అభిప్రాయపడ్డారు. కన్నా టీడీపీలోకి వస్తే ఏం చేయాలో తనకు తెలుసని చెప్పారు.

టీడీపీ బలం ఉందని చెప్పిన రాయపాటి..ఎవరి బలం పైనా ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. జనసేనతో పొత్తు లేకపోయినా పార్టీకి నష్టం లేదన్నారు. చంద్రబాబు - లోకేష్ మినహా మరెవరినీ ముఖ్యమంత్రి అభ్యర్ధులుగా అంగీకరించే పరిస్థితి లేదని..అందుకు నేతలు - కార్యకర్తలు ఒప్పుకోరని రాయపాటి చెప్పుకొచ్చారు.

రాయపాటి వ్యాఖ్యలతో టీడీపీలో చర్చ

రాయపాటి వ్యాఖ్యలతో టీడీపీలో చర్చ

కొద్ది రోజుల క్రితం తన కుమారుడికి టీడీపీ నుంచి సీటు ఇవ్వాలని రాయపాటి డిమాండ్ చేసారు. నర్సరావుపేటలో ఎక్కడి నుంచో వచ్చిన వారు పోటీ చేస్తే సహకరించమని తేల్చి చెప్పారు. ఇప్పుడు తాజాగా నర్సరావు పేట సీటు అక్కడ ఇంచార్జ్ గా ఉన్న డాక్టర్ అరవింద్ కు ఇవ్వాలని..ఈ సారి ఆయన ఖచ్చితంగా గెలుస్తారని రాయపాటి చెప్పుకొచ్చారు.

అదే సమయంలో కన్నా టీడీపీలోకి వస్తారని చెబుతున్న సమయంలో రాయపాటి చేసిన వ్యాఖ్యలు జిల్లా టీడీపీలో చర్చగా మారాయి. రాయపాటి వ్యాఖ్యల పైన ఇప్పుడు కన్నా వర్గం ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ.. రాయపాటి వరుసగా చేస్తున్న వ్యాఖ్యల పైన టీడీపీలో కొత్త చర్చకు దారి తీస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+