మాట్లాడితే బాబుకు కోపం, చెప్పుతో కొడతారు: ఊగిపోయిన రాయపాటి, అదే చెప్పాలని జేసీ
టిడిపి ఎంపీ రాయపాటి సాంబశివ రావు మంగళవారం నాడు రైల్వే అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు దక్షిణ మధ్య రైల్వే అధికారులతో భేటీ జరిగింది. ఈ సమావేశం మధ్యలోనే రాయపాటి అసంతృప్తితో బయటకు వచ్చారు.
విజయవాడ: టిడిపి ఎంపీ రాయపాటి సాంబశివ రావు మంగళవారం నాడు రైల్వే అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు దక్షిణ మధ్య రైల్వే అధికారులతో భేటీ జరిగింది. ఈ సమావేశం మధ్యలోనే రాయపాటి అసంతృప్తితో బయటకు వచ్చారు. అనంతరం ఆయన మాట్లాడారు.

చెప్పుతో కొడతారు
రైల్వే అధికారులు చిన్న చిన్న పనులు కూడా చేయడం లేదని రాయపాటి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే ప్రజలు తమను చెప్పులతో కొడతారని వ్యాఖ్యానించారు. భోజనం, టిక్కెట్ కోసం సమావేశాలకు వస్తారా అని మండిపడ్డారు.

నేను మాట్లాడితే చంద్రబాబుకు కోపం వస్తుంది కానీ
తాను మాట్లాడితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కోపం వస్తుందని రాయపాటి అన్నారు. అయినప్పటికీ తాను మాట్లాడుతానని చెప్పారు. రైల్వే అధికారులు ప్రధాని కన్నా పవర్ ఫుల్ అని వ్యాఖ్యానించారు.

ముందు రైల్వే జోన్ ప్రకటిస్తే..
విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు తొలుత రైల్వేజోన్ రావాల్సి ఉందని రాయపాటి అన్నారు. రైల్వే జోన్ రాకపోవడానికి అధికారులే కారణమని చెప్పారు. ముందు రైల్వే జోన్ వస్తే ఆ తర్వాత మెల్లిగా విశాఖకు మార్చుకోవచ్చునని చెప్పారు. లేదంటే కొన్నాళ్లకు విశాఖ జోన్ కూడా మరిచిపోతారన్నారు.

వాటి గురించి అడిగితే..
రైల్వే అధికారులతో భేటీ సమయంలో తాను పలు సమస్యలపై అఢిగానని చెప్పారు. దానికి సమాధానం లేదని అభిప్రాయపడ్డారు. గుంటూరు - తెనాలి డబ్లింగ్ పనులు పదేళ్లుగా జరుగుతున్నాయన్నారు. గుంటూరు - చెన్నై డే టైమ్ ట్రెయిన్ అడిగానని చెప్పారు.

రైల్వే అధికారులతో భేటీ అనంతరం..
రైల్వే అధికారులతో భేటీ అనంతరం తోట నర్సింహం మాట్లాడారు. రైల్వే జోన్ వస్తుందన్నారు. ఏపీ నుంచి రైల్వే మంత్రి ఎంపిక కావడంతో ఫలితాలు వస్తున్నాయన్నారు. కోస్టల్ కారిడార్‌ను రైల్వే శాఖ అభివృద్ధి చేయాలన్నారు.
అధికారులు ఏం చేయగలరో దానినే చెప్పాలని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అన్ని అంశాలపై పర్యవేక్షణకు ఓ అధికారిని నియమించాలని ఆయన సూచించారు.
-
చరిత్ర సృష్టించిన ఏపీ జెన్ కో.. 6160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో.. -
Amrit Bharat: చర్లపల్లికి మరో అమృత్ భారత్ ప్రారంభం-తెలుగు రాష్ట్రాల్లో హాల్ట్ లు ఇవే..! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్












Click it and Unblock the Notifications