మొహమాటమా ? ముందస్తు వ్యూహమా ? కన్నబాబుపై విమర్శలకు పవన్ వెనుకడుగు !

ఏపీలో వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్ ముందుగా గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో భాగంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు నిత్యం సంచలనం అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గతంలో సీఎం పదవి గురించి మాట్లాడకుండా మౌనం వహించి చంద్రబాబును సీఎం చేసేందుకే రాజకీయం చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొన్న పవన్ తాజాగా రూటు మార్చారు. అలాగే వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేస్తానని చెప్పిన పవన్ ఇప్పుడు ఇంకా నిర్ణయం తీసుకోలేదంటున్నారు. మరోవైపు గోదావరి జిల్లాల్లో అత్యధికంగా ఉన్న కాపు నేతలపై పవన్ వైఖరి ఆసక్తికరంగా మారింది.

ముఖ్యంగా నిన్న కాకినాడ వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వైసీపీకి చెందిన మాజీ మంత్రి, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుపై విమర్శలు చేసేందుకు ఇష్టపడలేదు. అంతే కాదు ఆయన్ను ప్రత్యర్ధిగా కాకుండా గతంలో తమతో ఉన్న అనుబంధం గుర్తుచేసేలా పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దీంతో పవన్ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవా లేక యథాలాపంగా వచ్చినవా అన్న చర్చ కూడా సాగుతోంది.

reason behind pawan kalyans dilemma on critisizing former ysrcp minister kannababu ?

కాపులకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారని జిల్లాలో వైసీపీ కాపు నేతలు తోట త్రిమూర్తులుతో పాటు కన్నబాబును పవన్ కళ్యాణ్ సాఫ్ట్ గానే ప్రశ్నించారు. ఏదైనా మాట్లాడితే కన్నబాబు బాధపడతాడంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాపు నేతల్ని సైతం ఆలోచనలో పడేశాయి. మేమే రాజకీయాల్లోకి తీసుకొచ్చాం, మా దురదృష్టం, తప్పు చేశామంటూ కన్నబాబును ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలతో ఆయన పశ్చాత్తాపానికి మాత్రమే పరిమితమయ్యారు.

గతంలో ఈనాడు జర్నలిస్టుగా ఉన్న కురసాల కన్నబాబు 2009 సమయంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టగానే చిరంజీవిని సంప్రదించి ప్రజారాజ్యం తరఫున కాకినాడ రూరల్ టికెట్ తెచ్చుకుని గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కాగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మారిపోయారు. 2014 ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్యేగా అదే సీటు నుంచి పోటీ చేసి భారీ స్ధాయిలో ఓట్లు తెచ్చుకున్నా విజయం మాత్రం సాధించలేకపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు.

గోదావరి జిల్లాల్లో ఈసారి టీడీపీ-జనసేన పొత్తు కుదిరితే కన్నబాబు వంటి వారికి కష్టమేనన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కన్నబాబు జనసేనవైపు చూడొచ్చన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ ఆయనపై విమర్శలు చేయకుండా పశ్చాత్తాపంతో సరిపెట్టడంతో ఈ అంచనాలకు ప్రాధాన్యం మరింత పెరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+