వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రఘురామకు మద్దతుగా పెరుగుతున్న వాయిస్ : వైసీపీ కౌంటర్ ప్లాన్ : ఢిల్లీలో ఏం జరుగుతోంది...!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతున్నారు. ఏపీ సీఐడీ అధికారులు త‌న‌ను చిత్ర‌హింస‌ల‌కు గురి చేశారంటూ ఎంపీ ఢిల్లీలో పలువురు కేంద్ర నేతలకు వివరించిన రఘురామ.. ఎంపీలకు లేఖలు రాసారు. దీని పైన కొందరు ఎంపీలు సైతం స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్‌, పాండ్య ఎంపీ సుమ‌ల‌త‌, కేర‌ళ ఎంపీ ప్రేమ్ చంద్ర‌న్, మ‌రో ఒడిశా ఎంపీ చంద్ర‌శేఖ‌ర్ సాహూ ఓపెన్ గా నే మాట్లాడారు. ఈ అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించాలని కోరగా..అందుకు వారు సరే అంటున్నారు. ఇదే సమయంలో బీజేపీ ఎంపీ స్పందించటం ఇప్పుడు చర్చకు కారణమైంది.

 వైసీపీ ఎంపీల కౌంటర్ ప్లాన్

వైసీపీ ఎంపీల కౌంటర్ ప్లాన్


ఎంపీ సంజయ్ జైస్వాల్ రఘురామ పై దాడి తనను బాధించిందని పేర్కొన్నారు. పార్లమెంట్ లో ప్రస్తావిస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే, ఇప్పటి వరకు వేచి చూసే ధోరణితో వ్యవహరించిన వైసీపీ అధినాయకత్వం దీనికి ధీటు గా కౌంటర్ ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా రాజ్ నాధ్ సింగ్..అమిత్ షా తోనూ భేటీ జరిగితే రాష్ట్ర అంశాలతో పాటుగా రఘురామ రాజు వ్యవహారం పైనా చర్చిస్తారని భావించారు. హైకోర్టు బెయిల్ తిరస్కరణ చేసే వరకు రఘురామకు గాయాలు అయినట్లుగా ఎక్కడా చెప్పలేదని..హైకోర్టులో ఆయన పిటీషన్ తిరస్కరించటం..సీఐడి కోర్టుకు చేరే సమయానికి ఈ రకమైన ప్రచారం మొదలు పెట్టారని వైసీపీ నేతలు చెబుతున్నారు.

మరోసారి స్పీకర్‌ను కలవాలనుకుంటున్న ఎంపీలు

మరోసారి స్పీకర్‌ను కలవాలనుకుంటున్న ఎంపీలు

కరోనా కారణంగా వైసీపీ ఎంపీల్లో కీలకమైన వారు ఏపీకే పరిమితమయ్యారు. వారిలో ముఖ్యులు ఢిల్లీ బాట పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఢిల్లీలో స్పీకర్ కు తాము ఇప్పటికే రఘురామ రాజు పైన అనర్హత పిటీషన్ పైన వారు అవసరమైతే మరోసారి స్పీకర్ ను కలవాలని ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. రఘురామ రాజు ఎంపీలకు రాసిన లేఖలు.. ఆయన చెబుతున్న విషయాల పైన తాము సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని..వాస్తవాలు ఏంటనేది ఇప్పటికే కేంద్రానికి పూర్తిగా తెలుసని పార్టీ నేతలు చెబుతున్నారు. రఘురామ రాజు వ్యవహరించిన తీరు...ముఖ్యమంత్రి..పార్టీ నేతల పైన చేసిన వ్యాఖ్యలు...ప్రయోగించిన బాష ఎవరూ సమర్ధించరనేది వైసీపీ నేతల వాదన.

రఘురామపై అనర్హత వేటు పడేలా..

రఘురామపై అనర్హత వేటు పడేలా..

ఇక, ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వచ్చిన తరువాత మరింతగా పరిస్థితులు వేడెక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. ఖచ్చితంగా రఘురామ రాజు పైన అనర్హత వేటు వేయాల్సిందేనని..ఆయన చేసిన వ్యాఖ్యలు..వ్యవహార శైలి గురించి స్పీకర్ కు మరిన్ని ఆధారాలు ఇచ్చేందుకు వైసీపీ ముఖ్య ఎంపీలు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు వచ్చే లోగానే ఈ ప్రక్రియ పూర్తి చేసే దిశగా ఎంపీలు ప్రయత్నించే అవకాశం ఉంది. దీంతో... అనర్హత వేటు పడేలా వైసీపీ ముఖ్య నేతలు... తన పైన చర్యలు తీసుకోకుండా రఘురామ రాజు ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతున్నారు. ఎవరి వ్యూహాలు ఫలిస్తాయనేది ఈ వారాంతంలో తేలే అవకాశం ఉంది. దీంతో..ఈ మొత్తం ఎపిసోడ్ ఏపీలో రాజకీయ పార్టీలకే కాకుండా..సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

English summary
YSRCP MP's are preparing a counter plan for rebel MP Raghurama as he is getting the support from other state MPs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X