రికార్డు ఉష్ణోగ్రతలు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తీవ్ర హెచ్చరిక..!!

తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం కొనసాగుతోంది. ఉదయం సమయంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం సమయానికి ఈదురు గాలులతో వర్షాలు కురుస్తు న్నాయి. సీమ జిల్లాల్లో గాలిలో తేమశాతం తగ్గడంతో ప్రజలు ఠారెత్తిపోయారు. కోస్తాలో మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత, ఉక్కపోతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. పలుచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఇదే సమయంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు చేసింది.

రికార్డు ఉష్ణోగ్రతలు
ఏపీలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. ఈ వేసవిలోనే తొలిసారి తిరుపతిలో 43.6 డిగ్రీల గరిష్ఠ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, నంద్యాల జిల్లా అవుకులో 42.6, తిరుపతి జిల్లా వెంకటగిరి, చిత్తూరు జిల్లా నగరి, ప్రకాశం జిల్లా పునుగోడులో 42.5, నెల్లూరు జిల్లా మునుబోలులో 42.4, పల్నాడు జిల్లా వినుకొండ, కడప జిల్లా ఉప్పలూరులో 42.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకు విస్తరించిన ఉపరితలద్రోణి, ఎండ తీవ్రత ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. దీంతో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురిశాయి.

record-temperatures-records-in-ap-imd-latest-alerts

రానున్న అయిదు రోజులు
ఇదే సమయంలో వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న ఐదు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా గంటకు 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో బలమైన ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఎండ తీవ్రత కొనసాగి పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని అంచనాలు వెల్లడించింది. కాగా, సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని 31 మండలాల్లో తీవ్రంగా, 20 మండలాల్లో మోస్తరుగా వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అటు తెలంగాణలో మరో రెండు రోజులు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

వరుస వర్షాలు
ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమ,మంగళవారాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నగ రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదు రుగాలులతో కూడిన వర్షాలు కురిసాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలున్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా నల్లగొండ, వరంగల్‌, సూర్యాపేట, మహబూబాబాద్, జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+