• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఏపీలో రికార్డుస్థాయిలో నమోదైన ఓటింగ్ ఏ పార్టీని గెలిపిస్తుందో ?

|
  AP Assembly Elections 2019 : ఏపీలో రికార్డుస్థాయిలో.... నమోదైన ఓటింగ్ ఏ పార్టీని గెలిపిస్తుందో..?

  ఏపీ ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టారు ? ఎవరి పాలన కావాలని కోరుకుంటున్నారు ? అనూహ్యంగా భారీగా పోలింగ్ పర్సంటేజ్ నమోదైన ఏపీలో పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ ఏ పార్టీకి లాభిస్తుంది. హైదరాబాద్ నుండి దండుగా వెళ్లి ఓట్లేసిన లక్షల మంది ఎవరిని ఆదరించారు ? ఏపీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ? ఇది ఏపీలో సగటు ఓటరుకు ఉత్కంఠ కలిగించే విషయాలు .

  ఏపీలో 80% పైగా పోలైన ఓటింగ్

  ఏపీలో 80% పైగా పోలైన ఓటింగ్

  ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికలో ఓటింగ్ రికార్డుస్థాయిలో నమోదైంది . ఇది ఒక స్వాగతించదగ్గ పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు . ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ నమోదు ఎవరూ ఊహించలేదు .అర్దరాత్రి వరకు కొనసాగిన పోలింగ్ లో ఓటర్లు చాలా సహనతో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇంత భారీగా ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకుంటారని ఏ రాజకీయ పార్టీలు ముందుగా అంచనా వేయలేదు. పలు ఉద్రిక్తతలు , పలు సాంకేతిక సమస్యల నడుమ పోలింగ్ కొనసాగింది . 400 కేంద్రాలలో సాంకేతిక సమస్యలవల్ల పోలింగ్ ఆలస్యం అయినందున అర్దరాత్రి కూడా ఓటింగ్ కొనసాగింది . 80 శాతం పైగా పోలింగ్ శాతం నమోదైనట్టు తెలుస్తుంది.

  ఓటింగ్ శాతం పెరగటం తమకే లాభం అని భావిస్తున్న ప్రధాన పార్టీలు

  ఓటింగ్ శాతం పెరగటం తమకే లాభం అని భావిస్తున్న ప్రధాన పార్టీలు

  ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు - టిడిపి, వై.సి.పి.లు భారీ ఓటింగ్ ను స్వాగతించాయి. ఓటింగ్ శాతంగా పెరగటం ద్వారా ఆ పెరిగిన ఓటింగ్ తమకంటే తమకే అనుకూలంగా వుందని , తమ పార్టీనే అధికారంలోకి వస్తున్నట్లు చెప్పుకుంటున్నాయి. టీడీపీ 130 స్థానాల్లో విజయం సాధిస్తుంది అని చంద్రబాబు చెప్తుంటే , ప్రమాణ స్వీకారం చేసేది తామేనని వైసీపీదే అధికారం అని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . అంతే కాదు ప్రమాణస్వీకారం చేసే తేదీని దేవుడే నిర్ణయిస్తారని జగన్ ధీమాతో ఉన్నారు . రెండు పార్టీలు ఎవరి అంచనాలలో వారు ఉన్నారు . ఎవరి లెక్కలు వారు వేస్తున్నారు.

  పోలింగ్ సరళిని బట్టి విజయావకాశాలపై అభ్యర్థుల నివేదికలను కోరిన అధినేతలు

  పోలింగ్ సరళిని బట్టి విజయావకాశాలపై అభ్యర్థుల నివేదికలను కోరిన అధినేతలు

  టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు జగన్ లు ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ సరళిని బట్టి విజయావకాశాలు ఎలా ఉన్నాయన్న నివేదికలు పంపాలని ఎమ్మెల్యే అభ్యర్థులను కోరారు. మే 23 వ తేదీన వెలువడే ఫలితాలలో ఏ పార్టీకి ఓటర్లు మొగ్గు చూపారో తేలనుంది . అప్పటి వరకు ఏపీలోని పార్టీల్లో ఈ టెన్షన్ కొనసాగనుంది. అయితే బయటకు విజయం మాదేనని చెప్తున్న పార్టీల అధినేతలు లోలోపల టెన్షన్ పడుతున్నారు .ఓటరు నాడి అంచనా వేసే పనిలో పడ్డారు . ఓటరునాడి అంత ఈజీగా నాయకులకు చిక్కుతుందా..!

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The record sort of voting in Andhra Pradesh general election is a welcome change and even political analysts haven't predicted this sort of huge voter turnout. While the voting percentage is declared at 75 percent by 6 PM, it is expected that it would easily cross 80 percent mark since voting is being continued in as many as 400 centres where it got delayed due to technical issues like malfunction of EVMs.While both major political parties - TDP and YCP - are boasting confidence of coming to power citing the voting percentage, both the parties are jittery and making their own assessments. Both TDP supremo Chandrababu Naidu and YCP president Jagan have been asking the MLA candidates to send their reports on winning chances in order to gauge the public mood before May 23rd.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more