Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ధాన్యం అమ్ముకోలేకపోతున్నారా ? రైతులకు ఏపీ సర్కార్ టోల్ ఫ్రీ నంబర్..!

ఏపీలో ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా క్షేత్రస్ధాయిలో మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు దిత్వా తుపాన్ ప్రభావంతో రెండు రోజులుగా అక్కడక్కడా వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీంతో రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు వీల్లేగుండా పోతోంది. అలాగే పలు చోట్ల సాంకేతిక సమస్యలు కూడా ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ధాన్యం కొనుగోలు సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు 1967 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ ను కూడా ఇవాళ ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటి వరకు 11.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేసినట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1,77,934 మంది రైతుల నుంచి 11,93,743 మెట్రిక్ టన్నుల ధాన్యం కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆయన తెలిపారు. అలాగే రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.2,830 కోట్లు జమ చేశామన్నారు.

Relief for Farmers AP Government Rolls Out Toll-Free 1967 for Paddy Procurement Concerns

రైతులు ధాన్యం విక్రయ ప్రక్రియలో ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు విజయవాడ కానూరు సివిల్ సప్లై భవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఏ సమస్యైనా వెంటనే తెలియజేయడానికి 1967 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ నంబర్ సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు.

Relief for Farmers AP Government Rolls Out Toll-Free 1967 for Paddy Procurement Concerns

రైతులు ధాన్యం రిజిస్ట్రేషన్ సమస్యలు, టోకెన్ రావడంలో ఆలస్యం, ఆర్ఎస్కే/మిల్లులో తూకం సమస్యలు, ఎఫ్‌టిఒ పెండింగ్, రవాణా లేదా గోనె సంచుల కొరత,ఏదైనా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు ఆగిపోవడం వంటి సమస్యలపై 1967కి కాల్ చేయవచ్చని మంత్రి తెలిపారు. కాల్ చేసే ముందు రైతులు ఆధార్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్,టోకెన్ నెంబర్, గ్రామం పేరు,ఆర్ఎస్కే వివరాలు సిద్దం చేసుకోవాలన్నారు. కంట్రోల్ రూమ్‌లో ఫిర్యాదు నమోదు చేసి సంబంధిత అధికారులకు పంపుతారన్నారు. సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేవరకు అధికారులు ఫాలోఅప్ చేస్తారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సివిల్ సప్లై అధికారులు మండలాల వారీగా రైతులు, రైస్ మిల్లర్లు, ఆర్ఎస్కే నిర్వాహకులను ఫోన్ ద్వారా సంప్రదించి ధాన్యం కొనుగోలు సమస్యలను తెలుసుకుని తక్షణ సూచనలు అందిస్తున్నారన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+