వీడియో: టీడీపీ గెలిచిన వెంటనే చేసింది ఇదీ: హెల్త్ యూనివర్శిటీలో అనూహ్య ఘటన

Chandrababu Naidu: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడుతున్న ఫలితాలు తెలుగుదేశం పార్టీలో జోష్‌ను నింపాయి. ఆ పార్టీ క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి ఇప్పటికే మూడొంతులకు పైగా సీట్లను సాధించింది ఈ రెండు చోట్ల కూడా.

ఈ నేపథ్యంలో- అనూహ్య పరిణామాలు ఏర్పాడుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నారు. త్వరలోనే ఆయన గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు. ఈ సాయంత్రం ఆయన గవర్నర్‌ను కలుస్తారని చెబుతున్నారు.

Replacing the name of Dr YSR Health University with NTR

2019 నాటి ఎన్నికల కంటే కూడా దారుణ పరాజయాన్ని చవి చూసింది వైఎస్ఆర్సీపీ. కనీసం 20 సీట్లను కూడా దక్కించుకోలేనంత దీనస్థితికి చేరింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కనీసం 23 సీట్లయినా లభించాయి. అయిదు సంవత్సరాలు తిరిగే సరికి వైఎస్ఆర్సీపీ పరిస్థితి అంతకంటే దారుణంగా మారింది.

వైఎస్ జగన్ కేబినెట్‌లోని దాదాపు మంత్రులందరూ ఓటమి పాలయ్యారు. వైఎస్ఆర్సీపీ కంచుకోటలుగా భావించే నియోజకవర్గాలన్నీ కుప్పకూలిపోయాయి. వైఎస్ఆర్సీపీకి గట్టిపట్టుగా భావించే రాయలసీమ జిల్లాల్లోనూ ఆ పార్టీ అత్యంత దారుణంగా మట్టికరిచింది. ఇప్పట్లో కోలుకోలేని స్థితికి దిగజారింది.

టీడీపీ- జనసేన- బీజేపీకి కలిపి 160కి పైగా అసెంబ్లీ స్థానాలు ఇప్పటికే ఖరారయ్యాయి. కౌంటింగ్ పూర్తిగా ముగిసేసమయానికి ఈ సంఖ్య మరింత పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ వైఎస్ఆర్సీపీ నంబర్లు పాతాళానికి పడిపోతూ వచ్చాయే తప్ప ఏ స్థాయిలోనూ మెరుగుపడలేదు. కనీసం గట్టిపోటీ సైతం ఇవ్వలేకపోయింది టీడీపీ కూటమికి.

ఈ పరిణామాలతో తెలుగుదేశం పార్టీ క్యాడర్‌లో జోష్ పెరిగింది. వెంటనే వాళ్లు డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ ప్రాంగణానికి చేరుకున్నారు. డాక్టర్ వైఎస్సార్ పేరును తొలగించారు. దాని స్థానంలో ఎన్టీఆర్ అనే అక్షరాలను తగిలించారు. ఎన్టీ రామారావు, చంద్రబాబు, టీడీపీకి అనుకూలంగా నినాదాలు చేశారు.

గతంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా కార్యకలాపాలను కొనసాగించిన విషయం తెలిసిందే. 2022లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పేరును తొలగించారు. దాన్ని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మార్పు చేస్తూ 2022 అక్టోబర్ 31వ తేదీన గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+