బాబు లక్ష్యాన్ని రిపబ్లిక్ వేడుకల్లో చెప్పిన గవర్నర్, మతం ఆధారంగా దారుణం: జగన్

విజయవాడ: గణతంత్ర వేడుకలు బెజవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో మంగళవారం నాడు జరిగాయి. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు దళాల నుంచి గౌరవవందనం స్వీకరించారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు, ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్‌, పలువురు రాష్ట్ర మంత్రులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. గణతంత్ర వేడుకలను తిలకించేందుకు ప్రజలు తరలివచ్చారు.

Republic Day celebrations in Vijayawada

తెలుగు భాష ఎంతో రమణీయమైనదని గవర్నర్ నరసింహన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ గడ్డ పైన ఎందరో మహానుభావులు, పోరాటయోధులు జన్మించారన్నారు. సాహితీవేత్తలు, సమరయోధులు జన్మించిన గడ్డ అన్నారు. రెండంకెల వృద్ధి రేటు ప్రభుత్వ లక్ష్యం అన్నారు. చంద్రబాబు రెండంకెల వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే.

అంతకుముందు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ సీతానగరంలోని తన నివాసంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు.

Republic Day celebrations in Vijayawada

మతం ఆధారంగా సర్టిఫికెట్ ఇవ్వకపోవడం దారుణం: జగన్

మతం ఆధారంగా దళితులకు సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం దారుణమని వైసిపి అధినేత జగన్ అన్నారు. వ్యవస్థ మార్పు కోసం తమ పార్టీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. దళితులకు అన్యాయం జరుగుతోందన్నారు. దళితుల, సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఇప్పటికీ మారలేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+