రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్, చంద్రబాబుతో పాటు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిన రాజకీయ ప్రముఖులు!!

క్రైస్తవులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. ఈరోజు క్రిస్మస్ పండుగ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జోరుగా కొనసాగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలలోనూ క్రిస్మస్ సందడి కనిపిస్తుంది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన చర్చిలు సామూహిక ప్రార్థనలకు రెడీ అయ్యాయి. ఇదే సమయంలో రాజకీయ ప్రముఖులు క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏసుక్రీస్తు ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలని ఆకాంక్షిస్తూ... క్రైస్తవ సోదర సోదరీమణులందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ అయిన ట్వీట్ చేశారు.

Revanth Reddy, Pawan Kalyan, Chandrababu along with political celebrities wishes on Christmas!!

తెలుగు ప్రజలకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు ఆశించిన శాంతియుత సమాజ స్థాపనకు కృషి చేద్దామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రేమను పంచటం, అందరినీ సమదృష్టితో చూడటం అలవాటు చేసుకోవాలని క్రిస్మస్ సందర్భంగా చంద్రబాబు సూచించారు. సమాజంలోని బాధితుల పక్షాన నిలబడి ప్రేమను పంచాలన్నారు చంద్రబాబు నాయుడు.

మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్రీస్తు ఆచరించిన ప్రేమ, కరుణ, సహనం ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని, క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ లోకేష్ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఏసుక్రీస్తు చెప్పిన త్యాగం, దయాగుణం అలవర్చుకుంటే జీవితం సంతోషమయం అవుతుందని లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ యేసు చూపిన సేవ మార్గంలో నడిస్తే ప్రతిరోజు వేడుకగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలందరి పట్ల ప్రేమ, కరుణతో మెలుగుదాం అని ఆయన పేర్కొన్నారు. క్రిస్మస్ వేడుకలను ప్రజలంతా కలిసికట్టుగా నిర్వహించుకోవాలని నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు.

మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రేమ, కరుణ, క్షమా గుణాలు తన జీవిత సందేశంగా మానవాళికి అందించిన యేసుక్రీస్తు జన్మించిన పర్వదినం క్రిస్మస్ అని, సామాజిక విలువలు చైతన్యవంతం కావాలంటే క్రీస్తు బోధించిన శాంతి, సహనం, ఔదార్యం సర్వదా ఆచరణీయమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

ప్రతి మనిషి ఎంతో కొంత పరోపకారం గుణం అలవర్చుకోకపోతే జీవితానికి అర్థం ఉండదని క్రైస్తవం బోధిస్తుంది అని పేర్కొన్నారు. ఈ క్రిస్మస్ పర్వదినాన దేశ ప్రజలందరూ శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు.ఇక మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత క్రీస్తు బోధనలు సదా స్మరణీయం.. ఆచరణీయం అని పేర్కొన్నారు. క్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+