ఏపీ పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల

ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు 8 రోజుల పాటు వాయిదా పడ్డాయి. సవరించిన షెడ్యూల్ ను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆది మూలపు సురేష్ ఇవాళ ప్రకాశం జిల్లా మార్కాపురంలో విడుదల చేశారు. వాస్తవానికి ఈ నెల 23 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా.. స్ధానిక సంస్ధల ఎన్నికల నేపథ్యంలో అది కాస్తా 31కి మారింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 17 వరకూ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.

Revised Schedule For SSC Exams Released in Andhra Pradesh

పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ ఇదే:

తాజా షెడ్యూల్ ప్రకారం మార్చి 31న ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్-1,
ఏప్రిల్ 1న ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్-2
ఏప్రిల్ 3న సెకండ్ లాంగ్వేజ్‌ పేపర్
ఏప్రిల్ 4న ఇంగ్లీష్ పేపర్-1
ఏప్రిల్ 6న ఇంగ్లీష్‌ పేపర్-2
ఏప్రిల్ 7న మ్యాథమేటిక్స్ పేపర్-1
ఏప్రిల్ 8న మ్యాథమేటిక్స్ పేపర్-2
ఏప్రిల్ 9న జనరల్ సైన్స్‌ పేపర్-1
ఏప్రిల్ 11న జనరల్ సైన్స్ పేపర్-2,

ఏప్రిల్ 13న సోషల్ స్టడీస్ పేపర్-1,

ఏప్రిల్ 15న సోషల్ స్టడీస్‌ పేపర్-2,

Recommended Video

    AP CM YS Jagan Review Meeting On Corona Virus | ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవాలి! | Oneindia Telugu

    ఏప్రిల్ 16న ఓఎస్‌ఎస్సీ మెయిల్ లాంగ్వేజ్‌ పేపర్-2, 17న ఒకేషనల్ కోర్సుల పరీక్ష ఉంటుంది. పరీక్షల మధ్యలో మొత్తం ఐదు రోజులు సెలవులు రానున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు ఉంటాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+