రిజిస్ట్రేషన్ విలువల మార్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..! వారికి షాకులే..?
ఏపీలో కొత్త ఏడాదిలో రిజిస్ట్రేషన్ విలువల్ని సవరించాలని భావించిన ప్రభుత్వానికి అది సాధ్యం కాలేదు. దీంతో నెల రోజుల పాటు ఈ ప్రక్రియను వాయిదా వేసేసింది.
అంతే కాదు తాజా ముహుర్తాన్ని కూడా ఫిక్స్ చేసింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ విలువల సవరణలో ఏం జరగబోతోందో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో కొందరి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

ఏపీ ప్రభుత్వం వాస్తవానికి రిజిస్ట్రేషన్ విలువల్ని జనవరి 1 నుంచి మార్చాలని భావించింది. గతంలో వైసీపీ ప్రభుత్వం తమకు అనుకూలమైన వారు నివసించే ప్రాంతాల్ని ఎంచుకుని ఉద్దేశపూర్వకంగా ధరలు పెంచిందని ఆరోపిస్తున్న కూటమి సర్కార్.. వాటిని సవరించబోతోంది. అయితే అధికారులు క్షేత్రస్దాయిలో చేయాల్సిన కసరత్తు పూర్తి కాకపోవడంతో ఈ ప్రక్రియ కాస్తా ఫిబ్రవరి 1 నాటికి వాయిదా పడింది. ఈ విషయాన్ని రెవెన్యూ మంత్రి అనగాని స్వయంగా ప్రకటించారు.
మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి ఆధారంగా 15 నుంచి 20 శాతం రిజిస్ట్రేషన్ విలువలు పెంచాలనే ప్రతిపాదనలు వచ్చాయని మంత్రి తెలిపారు. అలాగే పలు చోట్ల ఇప్పుడున్న విలువలు కొనసాగించాలనే డిమాండ్లు వస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చేయబోతున్న ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువల పెంపు ఉంటుందని రెవెన్యూ మంత్రి తేల్చిచెప్పేసారు.
అలాగే గత వైసీపీ హయాంలో అడ్డగోలుగా పెంచాలని భావిస్తున్న ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువల్లో కోత పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకు ఉదాహరణగా నరసరావుపేటలో రిజిస్ట్రేషన్ ధరల్ని కోటి వరకూ పెంచారని, వాటిని 20 లక్షలు చేయబోతున్నట్లు రెవెన్యూ మంత్రి క్లారిటీ ఇచ్చేసారు. దీన్ని బట్టి చూస్తే వైసీపీ నేతల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో వారికి భారీ షాకులు ఇచ్చే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ మంత్రి చెబుతున్న దాన్ని బట్టి చూస్తే వైసీపీ నేతలు పెంచిన ప్రాంతాలన్నింటిలోనూ రిజిస్ట్రేషన్ ధరల కోత తప్పేలా లేదు. అలాగే అమరావతి, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో విలువల పెరుగుదల ఖాయంగా కనిపిస్తోంది.
-
ఉగాది కానుకగా "జాబ్ క్యాలెండర్" రిలీజ్.. ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే..? -
టిడ్కో ఇళ్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-వారికి డబ్బులు రిఫండ్..! -
ఏపీ పోలీసులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు..? -
జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ పై ప్రభుత్వం కీలక నిర్ణయం...!! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications