జగన్ హయాంలో ఆర్జీవీకి కోట్ల రూపాయల లబ్ది.. షాకిచ్చిన ఏపీ ఫైబర్ నెట్!
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఊహించని షాక్ తగిలింది. ఏపీ ఫైబర్ నెట్ రాంగోపాల్ వర్మకు భారీ షాక్ ఇచ్చింది. రాం గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు ఏపీ ఫైబర్ నెట్ 2.15కోట్లకు ఒప్పందం చేసుకొని 1.15కోట్ల రూపాయలను ఇచ్చిందని, అయితే వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించాల్సి ఉందని ఆ ఒప్పందాన్ని తుంగలో తొక్కి రాంగోపాల్ వర్మకు అనుచిత లాభాన్ని చేకూర్చారని ఏపీ ఫైబర్ నెట్ వెల్లడించింది.
వ్యూహం సినిమాకు అక్రమ లబ్ది చేకూర్చిన ఏపీ ఫైబర్ నెట్
ఈ క్రమంలో దీనిపై వివరణ కోరుతూ ఏపీ ఫైబర్ నెట్ లీగల్ నోటీసులు జారీ చేసింది.రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాకు ఏపీ ఫైబర్ నెట్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం కేవలం 1863వ్యూస్ మాత్రమే ఉన్నాయని, ఒక్కొక్క వ్యూకు ఒక వంద రూపాయలు చెల్లించవలసిన చోట ఒక్కొక్క వ్యూ కు 11వేల రూపాయలు చొప్పున చెల్లించి రాంగోపాల్ వర్మకు లబ్ధి చేకూర్చినట్టు తాజాగా ఏపీ ఫైబర్ నెట్ పేర్కొంది.

ఆర్జీవీకి కోటి 15 లక్షల రూపాయలు అనుచిత లబ్ది
వ్యూహం సినిమాకు వ్యూస్ లేకపోయినా రాంగోపాల్ వర్మకు ఒక కోటి 15 లక్షల రూపాయలను అనుచితంగా లబ్ధిని చేకూర్చారని ఏపీ ఫైబర్ నెట్ సంచలన విషయాలను వెల్లడించింది. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మతో పాటు పలువురికి లీగల్ నోటీసులను జారీ చేసినట్టు ఒక ప్రకటనలో పేర్కొంది.
వర్మతో పాటు వారికి కూడా లీగల్ నోటీసులు
ఈ అక్రమ చెల్లింపులపైన రాంగోపాల్ వర్మతో పాటు ఎండి మద్దిరాల మధుసూదన్ రెడ్డి, ఉయ్యూరు గుణ శశాంక్ రెడ్డి, ఆర్జీవి ఆర్.వీ గ్రూప్ భాగస్వామి గొట్టిముక్కల రవిశంకర్ వర్మ, ఆర్జీవి ఆర్వి గ్రూప్ ఎండి తదితరులకు లీగల్ నోటీసులను పంపింది. ఈ చెల్లింపులకు సమాధానం చెప్పాలని లీగల్ నోటీసుల లో పేర్కొంది.
వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని నోటీసులు
నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందిన కారణంగా 15 రోజులలోపు వడ్డీతో సహా మొత్తం కట్టాలని లీగల్ నోటీసుల లో వెల్లడించింది ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి ఆదేశాలతో ఈ లీగల్ నోటీసులను పంపించారు. ఈ అక్రమ చెల్లింపులపై తగిన చర్యలు తీసుకుంటామని ఏపీ ఫైబర్ నెట్ ఎండీ జీవీ రెడ్డి స్పష్టం చేశారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications