RIP ఆర్జీవీ.. ఊహించలేదు.. కంగ్రాట్స్ జగన్.. టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన ట్వీట్..

ఏపీలో రాజకీయాలు నానాటికీ దారుణంగా మారిపోతున్నాయి. రాజకీయ ప్రత్యర్ధులపై నేతలు దాడులు, ప్రతిదాడులు చేసుకోవడం పరిపాటిగా మారిపోయింది. అయితే ఇందులో టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన దర్శకులు, నిర్మాతలు, నటులు మధ్యలో దూరడం, చీవాట్లు పెట్టించుకోవడం కూడా చూస్తూనే ఉన్నాం. ఇదే క్రమంలో తాజాగా చంద్రబాబు కందుకూరు, గుంటూరు సభల్లో జరిగిన తొక్కిసలాటలపై టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఇదే అనుభవం ఎదురైంది.

కందుకూరు, గుంటూరులో బహిరంగసభలు పెట్టి జనం తొక్కిసలాటకు కారణమయ్యారంటూ చంద్రబాబుపై గతంలో రాంగోపాల్ వర్మ తీవ్ర విమర్శలతో ట్వీట్లు పెట్టారు. అందులోనూ దారుణమైన భాష వాడారు. అయితే అప్పట్లో ఈ ఘటనలపై సహజంగానే విమర్శలు వస్తున్న క్రమంలో టీడీపీ నేతలు కూడా మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు ఆ వేడి కాస్తా చల్లారడంతో ఇప్పుడు ఎదురుదాడికి దిగుతున్నారు. ఇదే క్రమంలో టీడీపీ నేత బుద్ధా వెంకన్న దర్శకుడు ఆర్జీవీని ఉద్దేశించి ఆయన భాషలోనే కౌంటర్ ట్వీట్ పెట్టారు.

RIP RGV.. Congrats Jagan.. Tdp leader budda venkanna sensational tweet

కామంతో కాళ్లు నాకావని అనుకున్నా కానీ పేటీఎం డబ్బుల కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదంటూ బుద్దా వెంకన్న ఆర్జీవీని ఉద్దేశించి ట్వీట్ పెట్టారు. ఇది సంచలనంగా మారింది. తాజాగా హీరోయినట్లతో పలు యూట్యూబ్ వీడియోలు చేస్తున్న ఆర్జీవీ.. వాటిలో శృతిమించి శృంగారం చేస్తున్నారు. వారిని ఇంప్రెస్ చేసేందుకు కాళ్లు నాకుతూ కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటిని గుర్తుచేస్తూ, అలాగే వైసీపీ సర్కార్ కు లింక్ చేస్తూ బుద్దా వెంకన్న సైటెర్లు వేశారు. చివర్లో రిప్ ఆర్జీవీ, కంగ్రాట్స్ జగన్ రెడ్డీ అంటూ బుద్దా వెంకన్న ముగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+