RISE survey Results : ఏపీలో ఎన్డీయే పరిస్దితి ఇదీ-తాజా సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..!
ఏపీలో భారీ మెజార్టీతో, భారీ ఆశలతో కూటమి ప్రభుత్వం గతేడాది కొలువు తీరింది. అనంతరం చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో విపక్ష వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. రాష్ట్రంలో తిరిగి పుంజుకునేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అధికార కూటమిలో ఉన్న మూడు పార్టీల ఎమ్మెల్యేలు, వారిలో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువగా ఉందన్న సర్వే ఫలితాల నేపథ్యంలో తాజాగా రైజ్ సంస్ధ రాష్ట్ర వ్యాప్త సర్వే ఫలితాలు ప్రకటించింది.
గతంలో ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టి జోన్ల వారీగా గోదావరి, కృష్ణా-గుంటూరు, నెల్లూరు-ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఫలితాలు విడివిడిగా ప్రకటించిన రైజ్ సంస్ధ తాజాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మీద పరిస్దితి ఎలా ఉందో ఫలితాలు వెల్లడించింది. ఇందులో గ్రీన్ జోన్ లో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 28 మందిగా పేర్కొంది. అలాగే రెంజ్ జోన్ లో 97 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలిపింది. ఇక రెడ్ జోన్ లో ఉన్న ఎమ్మెల్యేలు 50 మంది మంది అంటూ సర్వేయర్ ప్రవీణ్ పుల్లట ఎక్స్ లో వెల్లడించారు. నియోజకవర్గాల వారీగా పూర్తి ఫలితాలు ఇవాళ వెల్లడించనున్నారు.

కూటమి ఏడాది పాలన సందర్భంగా.. రైజ్ రాష్ట్రవ్యాప్త సర్వే!
— Praveen Pullata (@praveenpullata) June 18, 2025
గ్రీన్ జోన్ లో ఉన్న ఎమ్మెల్యేలు - 28 మంది
ఆరెంజ్ జోన్ లో - 97 మంది
రెడ్ జోన్ లో ఉన్న ఎమ్మెల్యేలు - 50 మంది
వివరాలు రేపు
ఈ లెక్కన గ్రీన్ లేదా ఆరెంజ్ జోన్ లో ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు 125 మందిగా నిర్ధారించారు. 50 మంది ఎమ్మెల్యేలు మాత్రం రెడ్ జోన్ లో ఉన్నట్లు తేల్చారు. దీంతో తొలి ఏడాదిలోనే 50 మంది ఎమ్మెల్యేలు తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కుంటున్నట్లు తేలింది. 125 మంది ఎమ్మెల్యేలు మాత్రం పూర్తిగా లేదా పాక్షికంగా సేఫ్ జోన్ లోనే ఉన్నట్లు తేలింది. ఈ సర్వే ఫలితాలు ఎలా ఉన్నా ప్రభుత్వం తప్పిదాలు సరిదిద్దుకుని ముందుకెళ్తే మాత్రం ఈ లెక్కలన్నీ మరో నాలుగేళ్లలో మార్చుకునే అవకాశం ఎలాగో ఉండనే ఉంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.
-
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాల్లో బాలికలే టాప్-ఉత్తీర్ణతా శాతాలివే..! సప్లిమెంటరీ షెడ్యూల్..! -
AP Inter Results 2026 Release: ఇంటర్ ఫలితాల విడుదల -ఇలా చెక్ చేసుకోండి..! -
గ్రామాల్లోకి కూడా "అన్నా క్యాంటీన్లు"..! -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు రేపే-లోకేష్ కీలక ప్రకటన..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH!












Click it and Unblock the Notifications