రిషికేశ్వరి డైరీలో షాకింగ్: అన్నలాంటి వ్యక్తితో సంబంధం, అతను చెప్పినట్లే వినాలని బెదిరింపు!
గుంటూరు: రిషికేశ్వరి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సీనియర్ల వేధింపుల పైన రిషికేశ్వరి రాసుకున్న ఓ డైరీని పోలీసులు ఆమె హాస్టల్ గది నుంచే స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
తాజాగా ఆమె ఇంటిలో మరో డైరీ లభించింది. దీనిని ఆమె తల్లిదండ్రులు గురువారం పోలీసులకు అందంచారు. ఈ డైరీలో రిషికేశ్వరి 12 పేజీలు రాసుకుంది. రిషికేశ్వరి ఆత్మహత్యకు కారకులుగా భావిస్తూ సీనియర్లు శ్రీనివాస్, జయచరణ్, అనీషాలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
తాజాగా రెండో డైరీలోనూ వీరి వేధింపుల పైన రిషికేశ్వరి ఆవేదన వ్యక్తం చేస్తూ పేర్కొందని తెలుస్తోంది. తాను సోదరుడిలా భావించే జితేంద్రతో తనకు సంబంధం ఉందని శ్రీనివాస్, జయచరణ్‌లు తప్పుడు ప్రచారం చేశారని అందులో రిషికేశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది.

అంతేకాక తనను లైంగికంగా వేధించి వెంటపడ్డారని తెలిపింది. శ్రీనివాస్ చెప్పినట్లు వినాలని అనీషా తనను బెదిరించిందని పేర్కొందని తెలుస్తోంది. తమ చేతికి అందిన రెండో డైరీని హాస్టల్ గదిలో లభించిన డైరీ, సూసైడ్ నోట్‌తో పోలీసులు సరిపోల్చారు.
రెండో డైరీని కూడా రిషికేశ్వరి రాసిందని వారు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఫ్రెషర్స్ డే ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లిన సందర్భంగా రిషికేశ్వరి రెండో డైరీని రాసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. రిషికేశ్వరి తల్లిదండ్రులు మురళీకృష్ణ, దుర్గాబాయిలు ఆ డైరీని పోలీసులకు ఇచ్చారు.












Click it and Unblock the Notifications