జగన్ మంత్రి పదవి ఎందుకిచ్చారంటే ? అసలు కారణం చెప్పిన ఆర్కే రోజా..

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ,జనసేనగా సాగుతున్న రాజకీయాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆర్కేరోజా తరచుగా కౌంటర్లు వేస్తున్నారు. ఇవాళ మరోసారి రోజా ఇదే అంశంపై స్పందించారు. యోగివేమన జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా కటారుపల్లిలో వేమన విగ్రహావిష్కరణ చేసిన పర్యటక శాఖ మంత్రి ఆర్కే రోజా అనంతరం మీడియాతో మాట్లాడారు.

ప్రజలు మెచ్చిన ప్రజానాయకుడిపై కొందరు భౌ..భౌ.. అని అరుస్తున్నారని, వారి అరుపులు, వారు ఊగిపోవడాలు చూస్తుంటే ఒక పద్యం గుర్తొసొందని మంత్రి రోజా అన్నారు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను, సజ్జనుండు పలుకు చల్లగాను.. కంచు మోగినట్లు కనకంబు మోగునా...అని వేమన గారు పద్యం రాశారని రోజా తెలిపారు. మన రాష్ట్రంలో సజ్జనుడు అయిన నాయకుడు జగన్‌ అన్నారు. అల్పులు మాత్రం చాలా మంది ఉన్నారు. వారంతా... గుంపులుగుంపులుగా వస్తున్నారన్నారు. ఎవరెంతమంది కలిసొచ్చినా సింహం సింగిల్‌గానే వస్తుందన్నారు. కంచులెన్ని మోగినా.. అన్నట్టు వారంతా వీకెండ్‌ పొలిటీషియన్స్ మాత్రమేనన్నారు.

rk roja reveals why ys jagan given minister post to her, interesting comments on oppn

అల్పుణ్ని కంచుతోను, సజ్జనుణ్ని బంగారంతోనూ వేమన గారు పోల్చారని, సజ్జనుడంటే అందుకు జగన్‌ గారే ఉదాహరణ అని రోజా తెలిపారు. పాదయాత్రలో ఆయన ప్రజల కష్టాలను చూసి చలించిపోయి ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని, సంక్షేమానికి నడుం బిగించారన్నారు.. తల్లిదండ్రులను పట్టించుకోని నేటి సమాజం గురించి ఆనాడే వేమన తన పద్యాల్లో వర్ణించారని రోజా కొనియాడారు. మన సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించే తెలుగమ్మాయిగా తనకు పర్యాటక శాఖ మంత్రి పదవినిచ్చారని అన్నారు.

rk roja reveals why ys jagan given minister post to her, interesting comments on oppn

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వేమన జయంతి ఉత్సవాలను నిర్వహించడం ఎంతో గొప్ప విషయం. సంతోషంగా ఉందని మంత్రి రోజా తెలిపారు. 350 సంవత్సరాలైనా ఇప్పటికీ వేమన పద్యాలను నేటి పరిస్థితులకు అనుగుణంగా బేరీజు వేసుకుంటున్నామంటే వేమన గారి ఘనత ఎంత గొప్పదో మనకు అర్థమవుతుందన్నారు. ఆయన ఎంతో గొప్ప ప్రజాకవి, సామాజిక విప్లవకవి, ఆయనలో ఒక తాత్వికుడు ఉన్నారని ఆయన పద్యాలు నిరూపిస్తాయి. పండితులతో పాటు పామరులు కూడా మెచ్చిన పద్యాలను వేమన రాశారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+