Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దావోస్ నుంచి లోకేష్ లక్ష కోట్ల న్యూస్..! విశాఖ, సీమకు పండగే..!

ఏపీలో పెట్టుబడుల ఆకర్షణ కోసం దావోస్ పర్యటనకు వెళ్లిన ఐటీ మంత్రి నారా లోకేష్ ఇవాళ అక్కడి నుంచి బిగ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఐటీ రాజధానిగా అభివృద్ధి చెందుతున్న విశాఖతో పాటు పారిశ్రామిక హబ్ గా మారుతున్న రాయలసీమకు సైతం ఒకేసారి లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టే ఒప్పందంపై కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఆర్ఎంజడ్ గ్రూప్ తో ఒప్పందంపై ఇరువురూ సంయుక్త ప్రకటన చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా భారీఎత్తున మిశ్రమ-వినియోగం, డిజిటల్, పారిశ్రామిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఐటీ మంత్రి నారా లోకేష్.. RMZ గ్రూప్ ఛైర్మన్ మనోజ్ మెండాతో భేటీ అయ్యారు. సమతుల్య ప్రాంతీయ వృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంతో రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక, లాజిస్టిక్స్ అభివృద్ధి, అలాగే విశాఖపట్నంలో తర్వాతి తరం మిశ్రమ-వినియోగ, డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా మార్చే ప్రణాళికను ప్రకటించారు.

RMZ Group to Invest 10 Bn in AP 1 GW Data Centres in Vizag 1 Lakh Jobs in IT amp amp Logistics

సుమారు 50 ఎకరాలలో 10 మిలియన్ చదరపు అడుగుల వరకు సంభావ్య అంతర్నిర్మిత విస్తీర్ణంతో విశాఖపట్నంలోని కాపులుప్పాడ ఫేజ్-1 ఐటీ పార్క్‌లో జీసీసీ పార్క్‌ను అభివృద్ధి చేయాలని ఆర్ఎంజడ్ గ్రూప్ ప్రతిపాదించింది. అలాగే నగరంలో దశలవారీగా 1 గిగావాట్ సామర్థ్యంతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్‌ను కూడా గ్రూప్ ప్లాన్ చేస్తోంది. దీనికి సుమారు 500 నుండి 700 ఎకరాల భూమి అవసరం. ఈ ప్రాజెక్ట్ తదుపరి తరం డిజిటల్, ఏఐ అవసరాలకు పనికొస్తుంది.

RMZ Group to Invest 10 Bn in AP 1 GW Data Centres in Vizag 1 Lakh Jobs in IT amp amp Logistics

అలాగే రాయలసీమలోని టేకులోడులో , RMZ గ్రూప్ సుమారు 1,000 ఎకరాలలో పారిశ్రామిక, లాజిస్టిక్స్ పార్క్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రాంతంలో పారిశ్రామిక తయారీ, గిడ్డంగులు, లాజిస్టిక్స్ కార్యకలాపాలను ప్లాన్ చేస్తోంది.
ఈ ప్రాజెక్టుల కోసం వచ్చే ఐదారేళ్లలో సుమారు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించారు. ఇందులో ఐటీ, డేటా సెంటర్లు, పారిశ్రామిక, లాజిస్టిక్స్ రంగాలలో సుమారు లక్ష మందికి ఉపాధి లభించనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+