పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం; మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఎక్స్ గ్రేషియా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున దాచేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణా వాసులు మరణించారు. లారీ ఒక ఆటో ట్రాలీని డీ కొట్టిన ఘటనలో రోడ్డు రక్తమోడింది. దాచేపల్లి మండలం పొందుగుల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నర్సాపురం నుంచి గురజాల మండలం పులిపాడుకు కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన క్షతగాత్రులను గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో ఆటోలో 23 మంది ప్రయాణిస్తున్నారని సమాచారం.

road accident

మరణించిన వారు, క్షతగాత్రులు అందరూ తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నర్సాపురం వాసులుగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఏపీ లోని పల్నాడు జిల్లా దాచేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన ఐదుగురు కూలీలు మృతి చెందడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ను ఇస్తున్నట్టు ప్రకటించారు.

అలాగే గాయపడిన వారికి లక్ష రూపాయల పరిహారం ఇస్తున్నట్టు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావుతో మాట్లాడిన తెలంగాణ సీఎం కేసీఆర్, గాయాలపాలైన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+