రోజా వ్యాఖ్యలపై తోపులాట, ఘర్షణ: బాబుపై అంబటి ఫైర్

చిత్తూరు/ హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యురాలు రోజా చేసిన వ్యాఖ్యలపై చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపల్ సమావేశం శనివారంనాడు భగ్గుమంది. ఆమె వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకున్నాయి.

కాగా, రోజాపై టిడిపి కౌన్సిలర్లు ఎదురు దాడికి దిగినట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రోజా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా టిడిపి దాటవేసిందని అంటున్నారు. ఆ కారణంగానే పుత్తూరు మున్సిపల్ సమావేశం రసాభాసగా మారిందని ఆరోపిస్తున్నాయి. బడ్జెట్ కేటాయింపులపై రోజా ప్రశ్నించగా, టిడిపి సభ్యులు సమాధానం ఇవ్వకుండా ఎదురు దాడికి దిగినట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆరోపించారు.

Roja comments provoke TDP councillors

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. డిసెంబర్ దాటుతున్నా పింఛన్లు అందలేదని ఆయన శనివారం మీడియాతో ప్రతినిధులతో చెప్పారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కూడా పింఛన్లు అందక ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు.

చంద్రబాబు ప్రభుత్వానికి పింఛనుదార్ల ఉసురు తగులుతుందని ఆయన శాపం పెట్టారు. రుణమాఫీపై తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జనవరిలో ఏలూరు పరిసరాల్లో దీక్ష చేపడుతారని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+