జగన్ రెచ్చగొడ్తున్నారు: గాలి, ఇదే మగతనమా: రోజా తీవ్ర వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Oneindia Telugu

రాజమహేంద్రవరం: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో దేవాలయాల ఆస్తులను దోచుకు తిన్నారని, ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమకు నీతులు చెబుతున్నారని తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు శుక్రవారం నాడు మండిపడ్డారు.

టీడీపీ మంత్రితో వైసీపీ ఎమ్మెల్యే భేటీ: బాబు బెదిరింపులకు భయపడేది లేదన్న రోజా
సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి జలాలను రాయలసీమకు తరలిస్తుంటే జనగ్ జలదీక్షలు చేసి ప్రజలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు జగన్ కుట్ర పన్నారని ఆరోపించారు.

 roja, gali muddukrishnama naidu

రోజా తీవ్ర వ్యాఖ్యలు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా గురువారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకొని మహిళలను, వైసిపి వాళ్లని వేధించడం మగతనమా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు, గాలి ముద్దుకృష్ణమ నాయుడికి చెడ్డ రోజులు దాపురించాయన్నారు.

ఆంధ్రప్రదేశ్ కోసం..: బిల్ గేట్స్‌తో నేడు చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
అందరి ఉసురు తగిలి సర్వనాశనం అవుతారన్నారు. రంజాన్ తోఫా పంపిణీ సందర్భంగా నగరిలో తలెత్తిన వివాదంలో మున్సిపల్ చైర్ పర్సన్ శాంతి భర్త కుమార్, ఆమె తనయుడు మురళిని పోలీసులు అరెస్టు చేశారు. సత్యవేడు సబ్ జైలులో ఉన్న వారిని రోజా పరామర్శించారు. ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Gali Muddukrishnama Naidu says YS Jagan conspiracy to stop Polavaram project.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి