Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆంధ్రప్రదేశ్ కోసం..: బిల్ గేట్స్‌తో నేడు చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

అమరావతి: మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌తో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు టెలీ కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్నారు. శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో ఈ టెలీ కాన్ఫరెన్స్ ఉంటుంది.

వైద్య సేవలో భాగంగా బిల్‌గేట్స్‌ మిలిందా అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల దావోస్‌ పర్యటనలో భాగంగా చంద్రబాబు బిల్ గేట్స్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గేట్స్‌ మిలిందా ఫౌండేషన్‌ వైద్య సేవలు ఏపీలో చేపట్టాలని ఈ సందర్భంగా బిల్‌గేట్స్‌ను కోరారు.

Chandrababu Naidu teleconference with Bill Gates

దీనికి సంబంధించి శుక్రవారం రాత్రి 8.30 గంటలకు వీరిద్దరి మధ్య టెలీ కాన్ఫరెన్స్‌ జరగనుంది. గ్రామీణ ప్రాంతాలకు తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు వైట్‌ స్పేస్‌ పేరిట మైక్రోసాఫ్ట్‌ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. ఏపీలో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేసే అంశంపై కూడా వీరి మధ్య చర్చకు రానుందని తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+