క్రిస్పీ అండ్ టేస్టీ చికెన్ 65.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్..!

చికెన్ అనగానే చాలామందికి నోరూరుతుంది. చికెన్ ను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. చికెన్ ను ఎలా చేసుకున్నా టేస్టీగానే ఉంటుంది. మరి సూపర్ టేస్టీ చికెన్ 65 ను ఎక్కువగా రెస్టారెంట్స్ లోనే ఆరగిస్తుంటారు. ఈ సూపర్ టేస్టీ చికెన్ 65 తయారీ విధానం ఏంటి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి..? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..

కారంగా, క్రిస్పీగా, బయట క్రంచీగా లోపల జ్యూసీగా ఉండే ఫేమస్ చికెన్ 65 ను తయారు చేయాలంటే కావాల్సిన పదార్థాలు చికెన్ 500 గ్రాములు, పెరుగు మూడు టేబుల్ స్పూన్ లు, నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, కారం ఒకటిన్నర టేబుల్ స్పూన్, పసుపు పావు టేబుల్ స్పూన్, చికెన్ 65 మసాలా రెండు టేబుల్ స్పూన్ లు, కార్న్ ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ లు, మైదా ఒక టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి అర టేబుల్ స్పూన్, కరివేపాకు, పచ్చిమిర్చి మూడు లేదా నాలుగు చీలికలు, నూనె వేయించడానికి తగినంత తీసుకోవాలి.

Chicken65 Crispy and tasty what is the preparation method What ingredients are needed full details

ఇప్పుడు చికెన్ 65 తయారీ విధానం చూస్తే చికెన్ ను పెరుగు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, చికెన్ 65, మసాలా పొడి వేసి బాగా కలపండి. ఆ తర్వాత మేరినెట్ చేసిన చికెన్ లో కార్న్ ఫ్లోర్, మైదా వేయాలి. ఇప్పుడు బాగా కలిపి ముద్దగా అయ్యేలా కలపాలి. కడాయిలో నూనె వేడి చేసి ముక్కలను విడివిడిగా చేయాలి. మీడియం ఫ్లేమ్ లో క్రిస్పీగా వేయించుకోవాలి. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వేయించిన చికెన్ 65 ముక్కలను వేసి 1 నుంచి 2 నిమిషాలు హీట్ చేసి తీసేయాలి. అంతే సూపర్ టేస్టీ చికెన్ 65 రెడీ అయినట్టే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+