వాస్తు ప్రకారం ఈ మొక్క ఇంట్లో ఉంటే అన్నీ కలిసి వస్తాయ్: మనీ ప్లాంట్ కు ధీటుగా

ఇండోర్ ప్లాంట్లు పెంచడం ఓ ట్రెండ్‌.. ఓ ఆర్ట్. ఇల్లు అందంగా కనిపించడానికే కాకుండా గాలిని ప్యూరిఫై చేయడానికి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి చాలామంది ఇండోర్ మొక్కలను తమ గదుల్లో అమర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల మొక్కలు అందాన్ని ఇవ్వడమే కాకుండా ఇంట్లో సానుకూల శక్తిని పెంచడంలో దోహదపడతాయి కూడా. మనీ ప్లాంట్, కాయిన్ ప్లాంట్, లక్కీ బ్యాంబూ, క్రాసులా.. వంటివి ఈ కోవకు చెందినవే. తులసీ గురించి చెెప్పుకోనక్కర్లేదు. అష్టైశ్వర్యాలనూ కలిగించే సామర్థ్యం ఉందని నమ్ముతారు.

అలాంటి ప్రత్యేకత కలిగిన మొక్కల్లో పీస్ లిల్లీ (Peace Lily) ఒకటి. వాస్తు శాస్త్రంలో ఈ మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంది. పేరు, రూపానికి తగ్గట్టుగానే శాంతి, ప్రేమకు ఇది చిహ్నం. ఇంట్లో నిత్యం ఏదో ఒక అశాంతి వాతావరణం నెలకొన్నా లేదా దంపతుల మధ్య సఖ్యత లోపించినా, ఈ మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల అద్భుతమైన మార్పులు కనిపిస్తాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఇంట్లోని ప్రతికూల శక్తిని పారద్రోలి, ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

Peace Lily Vastu Benefits Invite Peace Prosperity and Positive Energy Home Best Place essential

ముఖ్యంగా బెడ్‌రూమ్ లో పీస్ లిల్లీ మొక్కను ఉంచడం వల్ల మానసిక ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. ఇది బెడ్ రూమ్ లో ఉంటే.. ప్రశాంతంగా నిద్ర పడుతుందని, పీడకలల రావని చాలామంది నమ్ముతారు. మానసికోల్లాసానికి, భావోద్వేగాలను నియంత్రించడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆఫీసులు, దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కూడా ఈ మొక్కను ఉంచడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. ఆఫీసు పనుల వల్ల కలిగే అలసటను, ఒత్తిడిని దూరం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

అలిపిరి నడకమార్గం, చిరుతల సంచారంపై మూడు రిస్క్ పారామీటర్లు గుర్తింపు
అలిపిరి నడకమార్గం, చిరుతల సంచారంపై మూడు రిస్క్ పారామీటర్లు గుర్తింపు

వాస్తు ప్రకారం, ఈ పీస్ లిల్లీ మొక్కను ఆఫీసు గదిలో ఈశాన్య దిశలో అమర్చుకోవడం వల్ల అత్యుత్తమ ఫలితాలు లభిస్తాయి. ఇది ఆ ప్రదేశంలో సానుకూల శక్తిని పెంచుతుంది. నూతనోత్తేజాన్ని కలిగిస్తుంది. పిల్లల చదువుల విషయంలో కూడా పీస్ లిల్లీ అద్భుతమైన మార్పును తీసుకువస్తుందని విశ్వసిస్తారు. కొన్నిసార్లు స్టడీ రూమ్‌లో ఉండే వాస్తు దోషాల వల్ల పిల్లలు సరిగ్గా చదువుపై దృష్టి పెట్టలేరు. అలా ఏకాగ్రత లోపించిన సమయంలో, వారి చదువుకునే గదిలో పీస్ లిల్లీ మొక్కను ఉంచడం మంచిది.

దీనిని గదిలోని ఏ దిశలోనైనా ఉంచవచ్చు. ఇది వారి దృష్టిని కేంద్రీకరించేలా చేసి, చదువులో పురోగతి సాధించడంలో తోడ్పడుతుంది. పరిమాణంలో చిన్నగా ఉండే ఈ మొక్కకు నిరంతరం సూర్యరశ్మి అవసరం లేదు. సూర్యకాంతి నేరుగా పడని ఏ ప్రదేశంలోనైనా దీనిని సులభంగా పెంచవచ్చు. దీనిని సరైన పద్ధతిలో సంరక్షించడం ఎంతో ముఖ్యం. మొక్క ఎండిపోతే మాత్రం విరుద్ధమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి క్రమం తప్పకుండా నీరు పోస్తూ, మొక్క పచ్చగా ఉండేలా చూసుకుంటే మీ ఇల్లు ఎల్లప్పుడూ సంతోషాలతో వెల్లివిరుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+