మోడీ, చంద్రబాబులపై రోజా నిప్పులు
ప్రశాంతంగా ఉన్న దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ సృష్టించి సామన్యప్రజలను భయందోళనకు గురి చేస్తున్నారని వైసిపి ఎమ్మేల్యే రోజా కేంద్రప్రభుత్వంపై మండిపడ్డారు.. ఆదివారం ఉదయం రోజా తిరుమల శ్రీవారిని విఐపీ బ్రేక్ లో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది రోజాకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన రోజా మోదీ, చంద్రబాబు, వెంకయ్యనాయుడుల పై నిప్పులు చెరిగారు. పెద్ద నోట్లను రద్దు చేసి సామాన్య ప్రజలను ప్రధానమంత్రి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. మోదీకి దమ్ముంటే ఆదాని, వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేయాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా సవాల్ చేసారు.












Click it and Unblock the Notifications