మొక్కులు చెల్లించిన రోజా

ఆడికృతిక.. తమిళులకు అత్యంత పవిత్రమాసం. కృతిక నక్షత్రం సుబ్రహ్మణ్యస్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. ఆడికృతిక రోజున సుబ్రహ్మణ్వేశ్వరుడిని భక్తిశ్రద్థలతో పూజిస్తారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తమిళనాడు అంతటా సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయాలకు భక్తులు పోటెత్తారు.

వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడం కూడా కలిసొచ్చింది. తమిళనాడులోని ప్రఖ్యాత పళని, తిరుత్తణి, తిరుచెందూర్, స్వామిమలై.. వంటి చోట్ల గల మురుగన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ తెల్లవారు జామునుంచే భక్తులు ఆలయాల ముందు బారులుతీరి నిల్చున్నారు.

Roja visits Tiruttani temple and offer prayers to Lord Subrahmanya Swamy during Sadi Krithigai 2025

ఆడి మాసంలో రెండు కృత్తిక నక్షత్రాలు వచ్చాయి. జూలై 20న తొలిసారిగా కృతిక నక్షత్రం నాడు ఈ వేడుకలు మొదలయ్యాయి. ఈ నెల 20వ తేదీన ముగియనున్నాయి. నేడు- తిరుత్తణి, తిరుచెందూర్, పళని వంటి ఆలయాల్లో ఆడికృతిక ఉత్సవాలను జరుపుకొంటోన్నారు భక్తులు. తిరుప్పరంకుండ్రంలో ఈ నెల 20వ తేదీన ఈ ఉత్సవాలు జరుగుతాయి.

ఆడికృతికను పురస్కరించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్ కే రోజా.. తిరుత్తణి ఆలయాన్ని సందర్శించారు. ఇక్కడ వెలిసిన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కావడి మొక్కులను చెల్లించుకున్నారు.

అంతకుముందు- నగరిలోని తన నివాసం నుంచి పుష్ప కావడి పూజలు జరిపారు. కావడితో తిరుత్తణికి బయలుదేరి వెళ్లారు. ప్రతి సంవత్సరం ఆడికృతిక నాడు క్రమం తప్పకుండా కావడి మోయడం, తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామివారి ఆలయాన్ని దర్శించడం రోజా ఆనవాయితీ.

ఈ సంవత్సరం కూడా తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని ముక్కు చెల్లించుకుని ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె వెంట కుటుంబ సభ్యులు, నగరి నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. స్వామివారి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రోజాకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

కాగా ఆడికృతిక పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శనివారం శ్రీవారి సారె సమర్పించారు. ఈ సందర్భంగా తిరుత్తణి ఆలయ ఛైర్మన్ శ్రీధర్, తమిళనాడు దేవాదయశాఖ జాయింట్ కమిషనర్ రమణి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం మంగళవాయిద్యాల మధ్య టీటీడీ తరఫున పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+