విజయవాడకు పొంచివున్న ముప్పు..! అప్రమత్తమైన సీఎం జగన్.. ఆదేశాలు జారీ!
విజయవాడ నగరంలో కుళ్ళిపోయిన మాంసాన్ని విక్రయిస్తున్నారన్న సమాచారంతో కొత్తపేట హనుమంతరాయ మార్కెట్ లో ఈరోజు ఉదయం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ రవిచంద్ర తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఎదురైన సంఘటనలు ఆయన్ను షాక్ కు గురిచేశాయి. కుళ్లిపోయిన మాంసాన్ని, మేక తలకాయ భాగాన్ని విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. అలాంటి మాంసానని సుమారు 100 కేజీల వరకు గుర్తించారు.
కుళ్లిపోయిన మాంసాన్ని తినడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతారని వెల్లడించారు. ప్రజలంతా మాంసాన్ని కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండి సూక్ష్మంగా పరిశీలన చేసిన తరువాతే కొనుగోలు చేయాలని సూచించారు. కుళ్లిపోయిన మాంసాన్ని ఎవరైనా విక్రయిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డాక్టర్ రవిచంద్ర హెచ్చరించారు.
Recommended Video

నగరవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో మాంసం విక్రయదారులు కుళ్లిపోయినవాటిని, తలకాయ మాంసాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించిన ప్రభుత్వం అప్రమత్తమైంది. విజయవాడ మొత్తం అన్ని మాంసం దుకాణాలను తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ప్రజలకు అనారోగ్యం కలిగేలా వ్యర్థ మాంసాన్ని అమ్ముతుంటే అక్కడికక్కడే అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీచేసింది.












Click it and Unblock the Notifications