టీకి కేటాయింపు: సిఎం హాజరీపై జగన్ పార్టీ రగడ
కడప: కడప జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారంనాడు రసాభాసాగా మారింది. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ కడప జిల్లా జడ్పీ సమావేశానికి హాజరుకావటంపై జగన్ పార్టీ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు అభ్యంతరం తెలిపారు. దీనిపై కడప జిల్లా కలెక్టరు జోక్యం చేసుకొని ఎంపీ సమావేశానికి హాజరు కావచ్చని చెప్పారు.
ఎంపీ సీఎం రమేష్ సమావేశపు హాలు నుంచి బయటకు వెళ్లేవరకు తాము సభను నడపనివ్వమని వైయస్సార్ కాంగ్రెసు సభ్యులు తీర్మానించారు. దీంతోపాటు జడ్పీ సమావేశంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టారు. కాగా, వైసిపి సభ్యులపై సిఎం రమేష్ తీవ్రంగా మండిపడ్డారు.

వైసీపీ ఎమ్మెల్యేలు కనుక తనకు తెలంగాణలో ఓటు ఉందని నిరూపిస్తే సభలో క్షమాపణ చెప్పి తాను బయటకు వెళ్తానని ఆయన సవాల్ చేశారు. వారు కనుక ఆ ఆరోపణలు నిరూపించలేక ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేల అక్రమాలు బయట పడుతున్నాయి కాబట్టే తనపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యుల వాదన మరో రకంగా ఉంది. తమ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి తాము తలుచుకుంటే వైసిపి సభ్యులను ఏమైనా చేస్తానంటూ సిఎం రమేష్ బెదిరించినట్లు జగన్‌కు చెందిన సాక్షి మీడియాలో వార్తాకథనం వచ్చింది. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఎంపి సిఎం రమేష్ కడప జడ్పీ సమావేశానికి ఎలా వస్తారంటూ వైసిపి శాసనసభ్యుడు రాచమళ్లు ప్రసాద రెడ్డి ప్రశ్నించారు.
జడ్పీ సమావేశంలో సమావేశంలో ఉండడానికి సిఎం రమేష్ అనర్హుడని మినిట్స్‌లో రూల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, రూలింగ్ ఇవ్వడానికి జెడ్పీ చైర్మన్‌కు లేదని జిల్లా కలెక్టర్ వాదించారు. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు జెడ్పీ చైర్మన్ పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సిఎం రమేష్ కేటాయింపు తెలంగాణ రాష్ట్రానికి జరిగిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications