హడలెత్తిస్తున్న దొంగలు: ఏటీఎంలో రూ.15 లక్షలకు పైగా చోరీ
కర్నూల్ జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాలు పోలీసులు సవాలుగా మారాయి. ఎమ్మిగనూరు పట్టణంలో పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరం లో ఉన్న సిండికేట్ బ్యాంక్ ఏటీఎంలో చోరీ జరిగింది.
కర్నూలు: ముసుగు దొంగలు బ్యాంకులను, ఏటీఎంలను టార్గెట్ చేశారు. కర్నూల్ జిల్లా జరుగుతున్న వరుస దొంగతనాలతో ప్రజలు హడలెత్తి పోతున్నారు. గతవారంలో దేవనకొండ రాయలసీమ గ్రామీణ బ్యాంక్ సంఘటన మరచిపోక ముందే ఎమ్మిగనూరు పట్టణంలో సిండికేట్ బ్యాంక్ ఏటీఎం లో దుండగులు చొరబడి లక్షల్లో నగదు ఎత్తుకెళ్లారు దుండగులు.
కర్నూల్ జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాలు పోలీసులు సవాలుగా మారాయి. ఎమ్మిగనూరు పట్టణంలో పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరం లో ఉన్న సిండికేట్ బ్యాంక్ ఏటీఎంలో చోరీ జరిగింది. అందులో ఉన్న సుమారు 20 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు.

సిండికేట్ బ్యాంక్ ఏటిఎంను గ్యాస్ కట్టర్‌తో నిలువుగా కట్ చేశారు. ఏటిఎం లో 17 లక్షల 32 వేల రూపాయలు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకొని పోయినట్లు సీఐ ప్రసాద్ వెల్లడించారు. సోమప్ప సర్కిల్, పోలీస్ స్టేషన్ కు మధ్యలో ఉన్న సిండికేట్ బ్యాంక్ ప్రాంతం లో నిత్యం జనసంచారం ఉంటుంది.
ఈ ప్రాంతం లో దొంగతనం జరగడం పట్ల పోలీసులకు సవాలుగా మారింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వా డ్ ని రంగం లోకి దింపారు. ఏటీఎం గదిలోని సీసీ ఫుటేజ్ రికార్డ్ అయిన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. నిందుతుల కోసం గాలింపు చేస్తున్నట్లు ఆదోని డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.












Click it and Unblock the Notifications