మొంథా తుపాను మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు - సీఎం చంద్రబాబు
మొంథా తుపాన్ బీభత్సం సృష్టించింది. ఈ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుసి నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నది పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు, గ్రామాలు జలమయం అయ్యాయి. పలు గ్రామాల్లో రహదారులు తెగిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్థంభించాయి. కాగా ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి.. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.
భారీగా పంట నష్టం..
రాష్ట్రవ్యాప్తంగా 304 మండలాల్లోని 1,825 గ్రామాల్లో 87 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. ఇందులో 59 వేల హెక్టార్లకు పైగా వరి పంట నీట మునిగింది. పత్తి, మొక్కజొన్న, మినుము వంటి ఇతర పంటలు కూడా దెబ్బతిన్నాయి. మొత్తం 78,796 మంది రైతులు నష్టపోగా.. 42 పశువులు మృత్యువాత పడ్డాయని అధికారులు తెలిపారు. ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమేనని, వాస్తవ నష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

ఈ క్రమంలోనే ప్రజలను, రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. పంట నష్టాలపై ఐదు రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు. తుపాను కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. పునరావాస కేంద్రాల్లోని ప్రతి కుటుంబానికి గురువారం నాటికల్లా బియ్యం, నిత్యావసర సరుకులు అందజేయాలని స్పష్టం చేశారు.
మరోవైపు విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణ పనులను తక్షణమే పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ పనుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు సర్వీసులను యధావిధిగా కొనసాగించాలని సూచించారు. అంతే కాకుండా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలని.. డ్రైనేజీలను శుభ్రపరచాలని స్పష్టం చేశారు.
ఇక ఇప్పటికే తుపాను బాధితుల్లో ప్రతి కుటుంబానికి బియ్యం 25 కిలోలు (మత్స్యకారులకు 50 కిలోలు), కిలో కందిపప్పు , లీటర్ నూనె , కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు, కిలో చక్కెర పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇతర కూరగాయల సరఫరా బాధ్యతలను మార్కెటింగ్ కమిషనర్‌కు అప్పగించింది. నిత్యావసరాలతో పాటుగా బాధితుడికి రూ.1000 చొప్పున ఆర్థికసాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కుటుంబంలో ముగ్గురి కంటే ఎక్కువ ఉన్నా గరిష్ఠంగా రూ.3 వేలు అందివ్వాలని డిసైడ్ అయ్యారు.
మృతుల వివరాలు..
- నెల్లూరు జిల్లా మనుబోలు మండలం గొట్లపాళెంలో పొట్టేళ్లవాగులో పడి జయమ్మ అనే వృద్ధురాలు మృతిచెందారు.
- చలి తీవ్రతకు బాపట్ల జిల్లా అద్దంకి ఎన్టీఆర్ నగర్‌లో రేఖానార్ లక్ష్మి(61), హనుమంతరావు(84) మృతిచెందారు.
- కృష్ణా జిల్లాలో కొబ్బరిచెట్టు మీద పడటంతో కృత్తివెన్ను మండలానికి చెందిన సుబ్బారావు (54) చికిత్స పొందుతూ మరణించారు.
- కృష్ణా జిల్లాలో గంగూరుకు చెందిన వనం అన్నపూర్ణ(64) చలిగాలుల తీవ్రతను తట్టుకోలేక మృతి చెందారు.
- పల్నాడు జిల్లా వినుకొండలో మర్రెడ్డి రాములమ్మ (90) ఇంటి మట్టి గోడ కూలి రాళ్లు ఆమెపై పడడంతో మృత్యువాత పడ్డారు.
- ఉమ్మడి కర్నూలు జిల్లా చెలిమిల్లదారిలో భవనాశి వాగు ఉద్ధృతికి కొత్తపల్లి మండలం నాగంపల్లికి చెందిన నాగేశ్వరరావు గల్లంతయ్యారు.
- శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కంబిరిగాం వద్ద వరహాల గెడ్డపై ఉన్న కాజ్‌వే సమీపంలో దానగోరకు చెందిన సవర లోభానా(40) అనే వ్యక్తి గల్లంతయ్యారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications