భక్తులకు ఆర్‌టిసి గుడ్‌న్యూస్..పంచ వైష్ణవ క్షేత్ర దర్శనానికి స్పెషల్ బస్సులు..
భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ ఓ శుభవార్తను అందించింది. పంచ వైష్ణవ క్షేత్ర దర్శిని పేరుతో పుణ్యక్షేత్రాలను దర్శించేవారికోసం స్పెషల్ బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. డిసెంబర్‌లోనాలుగు రోజులు ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో ఉన్న ఐదు వైష్ణవ ఆలయాల దర్శనానికి ఏపీఎస్ఆర్‌టిసి శ్రీకాకుళం నుంచి స్పెషల్ సూపర్ లగ్జరీ బస్ సర్వీస్‌లను నడపనుంది. ఇక, స్పెషల్ బస్సు సర్వీస్‌లను భక్తులు వినియోగించుకోవాలని ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు కోరారు. ఆర్టీసీ యాత్రికుల కోసం నిత్యం కొత్త సర్వీసులను, ప్రత్యేక సర్వీసులను అందుబాటులో తీసుకొస్తుందని, ప్రయాణికుల డిమాండ్‌ను బట్టీ, యాత్రీకులు అత్యధికంగా వెళ్లే మార్గాలకు అతి తక్కువ ధరకే ప్రత్యేక సర్వీసులని అందిస్తుందని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ఐదు వైష్ణవ ఆలయాల దర్శనానికి ఈ బస్సు సర్వీస్‌లు అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్‌టీసీ అధికారులు పేర్కొన్నారు.

పంచ వైష్ణవ క్షేత్రదర్శిన పేరుతో..
ఈ నెల (డిసెంబర్) 7, 14, 21, 28 తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి ఉంటాయన్నారు. మార్గశిర మాసంలో పంచ వైష్ణవ క్షేత్రదర్శిన పేరుతో ఈ సర్వీసులు ఉండనున్నాయి. ఆయా తేదీల్లో శ్రీకాకుళం బస్‌స్టేషన్ నుంచి రాత్రి 8 గంటలకు బస్సులు బయలుదేరనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ముందుగా ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి అంతర్వేది చేరుంటారు. అక్కడ శ్రీలక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఉంటుంది. ఆత ర్వాత అప్పనపల్లి చేరుకుంటారు.
అక్కడ శ్రీబాల బాలజీ స్వామిని దర్శించుకుని, గొల్లలమామిడాడ చేరుకుంటారు. అక్కడ కోదండ రాముడి దర్శనం చేసుకుంటారు. అనంతరం అన్నవరం చేరుకుంటారు. అక్కడ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దర్శనం ఉంటుంది. అక్కడి నుంచి శ్రీకాకుళం చేరుకుంటారు. ఈ దర్శనాలకు ఒక్కో టికెట్ ధర రూ.2,150లు ఉంటుంది. భక్తులు టిక్కెట్లు బుక్ చేసుకోవడంతో పాటు ఇతర పూర్తి సమాచారం కోసం ఏపీఎస్ఆర్‌టిసి అధికారికి వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.












Click it and Unblock the Notifications