విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎపిఎస్ఆర్టీసీ యాజమాన్య వైఖరికి నిరసనగా ఈ నెల 27న ధర్నా

|
Google Oneindia TeluguNews

అమరావతి:ఎపిఎస్ఆర్టీసిలో పనిచేసే సిబ్బందికి శిక్షలు విధించే నిబంధనల్లో మార్పులు చేయాలని కోరుతూ ఆర్టీసి స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌ డబ్ల్యూ ఎఫ్‌) ఈనెల 27న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టనుంది. ఈ విషయాన్ని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌కె జిలానీ బాషా ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

అసలే ఉద్యోగ భధ్రత అతి తక్కువైన ఆర్టీసిలో...మార్చి 13న ఇచ్చిన సర్కులర్‌ ప్రకారం ఇకపై కనీస ఉద్యోగ భద్రత కూడా కరువవుతుందనే విషయం స్పష్టమవుతోందని ఎస్‌ డబ్ల్యూ ఎఫ్ యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సర్కులర్‌ రద్దు చేయాలని మంగళవారం ధర్నా చేయడంతో పాటు
ఏప్రిల్‌ 3న నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

RTC workers federation Dharna on march 27

ఆర్టీసీలో సిబ్బంది తప్పు లేకపోయినా శిక్ష వేస్తున్నట్లు గతంలో ఆర్టీసీ ఎండి పరిశీలనలో కూడా తేలిందని...అలాగే మొదటిసారి తప్పుకే సస్పెన్షన్‌, రిమూవల్‌ వంటి పెద్ద శిక్షలు వేయకూడదని ఆర్టీసీ గైడ్‌లైన్స్‌లో ఉన్నా విరుద్దంగా వ్యవహరిస్తున్నట్లు వీరు తెలిపారు. సర్కులర్‌ 1/2018లో ఆర్టీసీలో సమస్యలు ఉండవని, కార్మికులు ప్రేరణతో చక్కగా పని చేస్తారని వెల్లడించారని, అయితే తాజా సర్కు లర్‌లోని శిక్షలు, జరిమానాలు ఆర్టీసి కార్మికుడిని శిక్షల ఉచ్చులో బిగించాయని ఆవేదన వెలిబుచ్చారు.

ప్రయాణికులు టికెట్టు తీసుకోనందుకు కండక్టర్‌కు శిక్ష వేస్తామనడం శోచనీయమని యూనియన్ నేతలు అన్నారు. దీనికోసం కండక్టర్‌కు ఆరు నెలల నుంచి రెండేళ్ల ఇంక్రిమెంట్లు నిలపడం దేశంలోని ఏ ఆర్టీసిలోనైనా ఉందా అని వారు ప్రశ్నించారు. ఇదంతా ఉద్యోగుల సంఖ్య తగ్గించుకునేందుకు అమలు చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. 1, 2 అనుబంధాల్లో పేర్కొన్న జరిమానాలు, శిక్షల్ని వెంటనే రద్దు చేయాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ నేతలు డిమాండ్‌ చేశారు.

English summary
Vijayawada: APSRTC employees under the aegis of RTC workers' federation demands will stage dharna at all bus stations in the state on Tuesday, opposing the ‘anti-workers’ policies of the management.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X