అనసూయ కోసం అధికారుల ఓవరాక్షన్ - రచ్చ రచ్చ..!!

టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ కోసం అధికారుల ఓవరాక్షన్ రచ్చకు కారణమైంది. యాంక రింగ్ తో పాటుగా సినిమాల్లోనూ అనసూయ సక్సెస్ అయింది. అనసూయ వయ్యారాలు ఫోటోల రూపంలో వైరల్ అవుతూ ఉంటాయి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అనసూయ చిలిపి ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలకు అదే స్థాయిలో రెస్పాన్స్ ఉంటుంది. యూత్ లో రంగమ్మ అత్తకు ఉన్న క్రేజ్ మామూలు కాదు. అయితే, ఇప్పుడు అధికారులు అనసూయ కోసం చేస్తున్న ఓవరాక్షన్ పైన సామాన్యులు మండిపడుతున్నారు.

యాంకర్ అనసూయ మైదుకూరు టూర్ స్థానికులకు సమస్యగా మారింది. స్థానికంగా ఒక వస్త్ర దుకాణం ప్రారంభానికి అనసూయ వస్తుండటంతో అధికారులు అతిగా స్పందిస్తున్నారు. వస్త్ర దుకాణం ప్రారంభానికి ముందే మైదుకూరు ఆర్టీసీ అధికారులు బస్టాండ్ మెయిన్ ద్వారం మూసేశారు. దీంతో, ఉద్యోగులు .. విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ - టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందు కు తమ పిల్లలతో కలిసి పేరెంట్స్ బస్టాండ్ వద్దకు చేరుకునే సరికి ప్రధాన ద్వారా మూసివేసి ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

RTD officials closed main gate in Mydukuru due to Anchor Anasuya shop inauguration

నిత్యం మైదుకూరు నుంచి రాకపోలు సాగించే వారు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో, స్థానికులు ఆర్టీసీ అధికారులను నిలదీస్తున్నారు. కొందరు ఆగ్రహంతో అధికారుల పైన మండి పడుతున్నారు. వస్త్ర దుకాణం కోసం అనసూయ వస్తుంటే బస్టాండ్ ద్వారం మూసివేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే, అధికారులు మాత్రం తమకు వచ్చిన సూచనల మేరకే గేట్ మూసేసామని చెబుతున్నారు. దీంతో, బస్సులు ఎక్కటానికి వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు. దీని పైన ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారులకు కొందరు ఫిర్యాదు చేసారు. యాంకర్ వస్తే ఇంత అతిగా అధికారులు స్పందించాలా అంటూ సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+