విద్యార్థి చిత్ర ప్రదర్శన: రుచికా శర్మ హల్‌చల్ (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మాదాపూర్‌లో గల చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ద మైరెయిడ్ కన్‌ఫ్లిక్టింగ్ ఎమోషన్స్ పేరిట శుక్రవారం చిత్ర ప్రదర్శన ఏర్పాటైంది. దీన్ని మిసెస్ సౌత్ ఏసియా ఇంటర్నేషనల్ 2014 రుచికా శర్మ ప్రారంభించారు.
గోయెత్ జంట్రమ్ ఈడి అమితా దేశాయ్ కూడా ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో హైదరాబాద్ నగరానికి చెందిన చిత్రకారుడు అజయ్ రాథోడ్ ఉమెన్ కాన్సెప్ట్‌తో గిసిన 28 చిత్రాలు సందర్శకుల మనసు దోచుకున్నాయి.
అజయ్ రాథోడ్ చిత్ర ప్రదర్శన ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగుతుంది. వృత్తి వేరైనా ప్రవృత్తిపై మక్కువతో అజయ్ రాథోడ్ ఈ చిత్రాలకు జీవం పోశాడు. మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న అతను చిత్రకళపై మక్కువతో ఈ చిత్రాలను తన కుంచెతో ఆవిష్కరించాడు.

చిత్రప్రదర్శనలో రుచికా శర్మ
మహిళా సమస్యలపై చిత్రకారుడు అజయ్ రాథోడ్ అద్భుత చిత్రాలను ఆవిష్కరించాడని రుచికా శర్మ ప్రశంసించారు.

చిత్ర ప్రదర్శనలో రుచికా శర్మ
అజయ్ రాథోడ్ గీసిన ప్రతి చిత్రంలో జీవం ఉట్టిపడుతోందని రుచికా శర్మ కొనియాడారు. చిత్ర ప్రదర్శనను ఆమె శుక్రవారంనాడు ప్రారంభించారు.

చిత్ర ప్రదర్శనలో రుచికా శర్మ
రుచికా శర్మ ప్రారంభించిన అజయ్ రాథోడ్ ప్రదర్శనలో ఉంచిన ఓ చిత్రం ఇలా కనిపించింది. మహిళా సమస్యలపై అతను చిత్రాలు దీశాడు.

చిత్ర ప్రదర్శనలో రుచికా శర్మ
అజయ్ రాథోడ్ తన కుంచెతో గీసిన చిత్రాల ప్రదర్శనను రుచికా శర్మ ప్రారంభించారు. అద్భుతమైన కళను చిత్రకారుడు ప్రదర్శించాడని ఆమె అన్నారు.

చిత్ర ప్రదర్శనలో రుచికా శర్మ
హైదరాబాదు నగరానికి చెందిన అజయ్ రాథోడ్ గీసిన చిత్రాల ప్రదర్సనను ప్రారంభించి, వాటిని రుచికా శర్మ వాటిని చూస్తూ మురిసిపోయారు.












Click it and Unblock the Notifications