చంద్రబాబును అరెస్ట్ చేసే ఛాన్స్ ? పోలీసు వలయం కుప్పం ! రాష్ట్రంలో టీడీపీ ఆఫీసులకు కంచెలు !

ఏపీలో విపక్ష నేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో నిన్న మొదలుపెట్టిన పర్యటన ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యంగా కందుకూరు, గుంటూరు ఘటనల నేపథ్యంలో చంద్రబాబు కుప్పంలో రోడ్లపై తిరగకుండా పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయినా చంద్రబాబు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను తాజా ఉత్తర్వుల ప్రకారం అరెస్టు చేయాలని ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కుప్పంలోకి రాకపోకలు నిలివేశారు.

చంద్రబాబు కుప్పం టూర్

చంద్రబాబు కుప్పం టూర్

తన సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు చేపట్టిన మూడు రోజుల పర్యటన ఎన్నడూ లేనంత స్ధాయిలో ఉద్రిక్తతలకు కారణమవుతోంది. చంద్రబాబుపై గతంలోనూ ఆంక్షలు విధించినా, ఈసారి మాత్రం ఆ ఆంక్షలు దారుణంగా ఉండటంతో టీడీపీ శ్రేణులు రోడ్లపైనే పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేశారు. అదే సమయంలో చంద్రబాబును కూడా ముందు కెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుపడుతున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతల మధ్య చంద్రబాబు కుప్పం టూర్ కొనసాగుతోంది. అయితే చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబును అరెస్ట్ చేసే ఛాన్స్ ?

చంద్రబాబును అరెస్ట్ చేసే ఛాన్స్ ?


ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జాతీయ, రాష్ట్ర, పంచాయతీ రోడ్లపై కూడా ఎలాంటి ర్యాలీలు, రోడ్ షోలు చేయకూడదు. కానీ చంద్రబాబు అవేవీ పట్టించుకోకుండా రోడ్లపైనే మాట్లాడుతున్నారు. పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. దీంతో నిబంధనలను ఉల్లంఘించినందుకు చంద్రబాబును అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు అందినట్లు ప్రచారం జరుగుతోంది. ఏ క్షణమైనా చంద్రబాబును అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. దీని వెనుక కారణాలు లేకపోలేదు.

పోలీసుల ఆంక్షలతో అనుమానాలు ?

పోలీసుల ఆంక్షలతో అనుమానాలు ?

కుప్పంలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో బయటి నుంచి ఎవరూ పట్టణంలోకి అడుగుపెట్టకుండా పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. అలాగే ఇప్పటికే కుప్పంలో ఉన్న వారు కూడా బయటికి వెళ్లకుండా ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలోని టీడీపీ కార్యాలయాల వద్ద పోలీసుల బందోబస్తు పెంచారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద పోలీసులు ముళ్ల కంచె వేశారు. ఇలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ కార్యాలయాల వద్ద ముళ్ల కంచెలు వేస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు అరెస్ట్ అయితే అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు ఇలా ఆంక్షలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు అరెస్టు తప్పదన్న ప్రచారం సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+