జగన్ అన్నదే నేను చెప్పా: శోభాకు సబ్బంహరి కౌంటర్

Sabbam Hari
విశాఖపట్నం: యూపిఏకు బయటి నుండి మద్దతిస్తానని, కేంద్రమంత్రి పదవులు తీసుకుంటానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో పలుమార్లు చెప్పిన విషయాన్నే తాను చెప్పానని అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి సోమవారం అన్నారు.

2014 ఎన్నికలలో తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫునే పోటీ చేస్తానని ఇప్పటికీ చెబుతున్నానని, ఒకవేళ వాళ్లు ఆహ్వానించకపోతే ప్రశాంతంగా ఉంటానని చెప్పారు. తాను సొంతగా ఏమీ చెప్పలేదని, వైయస్ జగన్, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ చెప్పిన విషయాలే చెప్పానన్నారు.

2014 ఎన్నికల తర్వాత మతతత్వ భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉండదని జగన్ చాలాసార్లు చెప్పారని గుర్తు చేశారు. బయటి నుండి యూపిఏకు మద్దతిస్తామని విజయమ్మ చెప్పారన్నారు. డిఎంకె, ఎన్సీపిల మాదిరి బయటి నుండి మద్దతిస్తామని వారు గతంలో అన్నారని గుర్తు చేశారు. కేంద్రంలో వ్యవసాయ శాఖ సహా నాలుగైదు పదవులు తీసుకుంటానని కూడా జగన్ చెప్పారని తెలిపారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన ఇతర నాయకులు తన పైన చేసిన వ్యాఖ్యలు మీడియా ద్వారానే తెలిశాయన్నారు. తాను ఇప్పటి వరకు జగన్‌తోనే మాట్లాడానని పార్టీలోని ఇతర నాయకులతో తనకు సంబంధం లేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+