సిబిఐ కోర్టుకు సబిత, పూచీకత్తు: రైల్వే కోర్టుకు కెటిఆర్
హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ (ఓఎంసి) కేసులో రాష్ట్ర మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి బుధవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కోర్టు ఎదుట హాజరయ్యారు. సబితతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృపానందం కూడా హాజరయ్యారు. వీరు రూ.25 వేల పూచీకత్తును కోర్టుకు సమర్పించారు. న్యాయస్థానం కేసును ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు ఓఎంసి కేసులో నిందితులుగా ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అలీఖాన్ రిమాండును సిబిఐ కోర్టు 16వ తేదీ వరకు పొడిగించింది.
రైల్వే కోర్టుకు హాజరైన కెటిఆర్

తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం రైల్వే కోర్టుకు హాజరయ్యారు. సకల జనుల సమ్మె సమయంలో రైలు రోకోకు సంబంధించిన కేసులో ఆయన హాజరయ్యారు.
పట్టాలు తప్పిన రైలు
బెంగళూరు నుంచి హౌరా వెళుతున్న హౌరా ఎక్స్ ప్రెస్ మంగళవారం రాత్రి 10.30గంటలకు చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్ దాటిన తర్వాత పట్టాలు తప్పింది. వెళ్లాల్సిన ట్రాక్ నుంచి వాడుకలో లేని ట్రాక్ లోకి రైలు మళ్లడంతో ఇంజన్ తో సహా నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. డ్రైవర్ వెంటనే రైలును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. ఎవరూ గాయపడలేదు.












Click it and Unblock the Notifications