• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విషాదపట్టణం..! నిర్లక్ష్యానికి భారీ మూల్యం..! ఈ ఘోరానికి బాద్యులెవరు..?

|

విశాఖపట్టణం/అమరావతి : విశాఖపట్టణం ఇప్పుడు విషాదపట్టణంగా మారింది. ఎక్కడ చూసినా హృదయవిదారక ఘటనలే చోటుచేసుకుంటున్నాయి. ఏంజరిగిందో తెలుసుకునే లోపే పిట్టల్లా మనుషులు నేల రాలుతున్నారు. రసాయన పరిశ్రమ ఉద్యోగుల నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లింనుకునే పరిస్థితులు తలెత్తాయి. దాదాపు రెండు నెలలుగా తెరుచుకోని పరిశ్రమను తెరవాలని చేసిన ప్రత్నాల్లో బాగంగా తలెత్తిన పొరపాట్లు విషవాయువు ఎగిసిపడడానికి కారణమైనట్టు తెలుస్తోంది. దీంతో ఎంతో మంది అమాయర ప్రజలు, చిన్న పిల్లలు, వృద్దులు మృత్యువాత పడ్డారు. వేల మందికి అనేక వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘోరానికి కారణం ఎవ్వరు.? అకాల మరణాలకు బాద్యత ఎవరిది..?

 నిర్లక్ష్యంతోనే ప్రాణ నష్టం..

నిర్లక్ష్యంతోనే ప్రాణ నష్టం..

హఠాత్తుగా లీకైన విషవాయువును పీల్చుకున్నఅనేక మంది అస్వస్తతకు గురయ్యారు. మానవాళికే కాకుండా జీవ రాశులకు, వృక్ష, పక్షి సంపదకు విషవాయువు శరాఘాతంగా పరిణమించే అవకాశాలు ఉన్నాయని వైద్యులు నిర్ధారిస్తున్నారు. విశాఖ పట్టణం ఓ ​ప్రశాంతమైన నగరం. ప్రతి ఒక్కరు కూడా విశాఖ వెళ్లి కాస్త అలా భీమిలి బీచ్ లో సేదతీరాలి అనుకుంటారు. చల్ల గాలులతో, సముద్రపు అలల సవ్వడులతో, కెరటాల కేరింతలతో సస్యశ్యామలంగా ఉండే విశాఖ నగరానికి ఊహించని విపత్తు వచ్చి పడింది. గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి భారీగా కెమికల్ గ్యాస్ లీకై దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది.​

 పరిశ్రమ ఉద్యోగుల నిర్లక్ష్యం..

పరిశ్రమ ఉద్యోగుల నిర్లక్ష్యం..

గురువారం తెల్లవారు ఝామున ​విశాఖ శివారులో ​భారీ​ ఘోర విపత్తు సంభవించింది. అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపు జనం అస్వస్థతకు గురయ్యారు.​ లీకైన వాయువు వాసనకు కడుపులో వికారం, కళ్లలో మంటలు, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలె​త్తాయి. మనిషికి అందాల్సిన ఆక్సీజన్ అందకుండా 2 నిమిషాలు కూడా బతకలేడు. అలాంటి మొత్తం ఆక్సిజన్ ను ఆ వాయువు కలుషితం చేసింది. ఏం జరిగిందో నిర్ధారణ కాకపోతే సామాన్య ప్రజానికం మాత్రం ఏం చేయగలరు. వారు పీలుస్తుంది మామూలు ప్రణవాయువు బదులు విషవాయువని తెలిసేలోపు వారి ఆయువు అనంత లోకాలకు చేరిపోయింది. విలువైన ప్రాణ నష్టం జరిగిపోయింది.

ప్రకృతిపై ప్రకోపం..

ప్రకృతిపై ప్రకోపం..

విశాఖ పట్నం గ్యాస్ లీకైన ప్రమాదంలో ఇప్పటివరకు ​మొత్తం పది మంది మరణించారు. వందల మంది రోడ్డు పైనే అపస్మారక స్థితిలో పడిపోయారు. కొందరు ఇళ్ల నుంచి బయటకు వచ్చి మేఘాద్రి గడ్డవైపు పరుగులు తీ​శారు. బాధితులను రెస్క్యూ చేయడానికి వచ్చిన పోలీసులు కూడా కొందరు అస్వస్థతకు గురయ్యారు. ఇళ్లలో ఉంటే శ్రేయస్కరమేమోనని మరికొందరు తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. అప్రమత్తమైన పోలీసులు సైరన్‌ మోగిస్తూ ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరించారు. విషవాయువు ప్రభావం ఉన్న ప్రాంతాల నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు పోలీసులు.

  Vizag Gas Leak : LG Polymers Company Is The Main Culprit Behind Vizag Gas Tragedy
  ఆయువు తీసిన వాయువు...

  ఆయువు తీసిన వాయువు...

  ఈ విష వాయువు ఎక్కువగా ​చిన్నారులు, మహిళలు, వృద్దులపై ప్రభావం చూపింది. వారందరినీ వారి వారికి దగ్గలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.​ ​అస్వస్థతకు గురైన​ వారికి కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ వాయువు లీక్ ప్రమాదాన్ని మూడు రోజుల క్రితమే అధికారులకు సమాచారం అందినా వారు దాని ప్రమాద స్ధాయిని అంచనా వేయలేకపోయినట్టు తెలుస్తోంది. అదింత ఘోర ప్రమాదాన్ని కలిగిస్తుందని వారు ఊహించలేకపోయారని చెబుతున్నారు. విశాఖపట్టణంలో విష వాయువు విడుదలకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ రసాయన పరిశ్రమపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఇంతటి ప్రాణ నష్టానికి బాద్యత ఎవరిదనే ప్రశ్న మాత్రం ప్రశ్నగానే మిగిలిపోతుంది.

  English summary
  Visakhapatnam has now become a tragedy. Wherever there are heartbreaking events.There are situations where the negligence of the employees of the chemical industry is of huge value. The flaws in the efforts to open an industry that has not been open for nearly two months seems to have caused toxic gas.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X