ఎన్నికల వేళ పథకాల నిధుల విడుదలపై సజ్జల క్లారిటీ..!!

ఏపీలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. గెలుపు పైన ప్రధాన పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తూనే...అప్రమత్తం అవుతున్నారు. చివరి రెండు రోజుల ప్రచారం కొనసాగిస్తున్నారు. పోలింగ్ ముందు ప్రతీ అవకాశం సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేస్తునారు. అందులో భాగంగా తాజాగా హైకోర్టు పథకాల నిధుల విడుదలకు ఈ రోజు వరకు అనుమతి ఇచ్చినా ఈసీ నుంచి అభ్యంతరాలు కొనసాగుతున్నాయి. దీని పైన సజ్జల కీలక వ్యాఖ్యలు చేసారు.

సజ్జల వ్యాఖ్యలు
ఏపీలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పైన టీడీపీ చేస్తున్న ప్రచారం పై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ చెత్త అని బీజేపీతో చెప్పించగలరా అని ప్రశ్నించారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేస్తామని మోదీ, అమిత్‌షాతో ఎందుకు చెప్పించలేదని నిలదీశారు. 15 రోజులుగా చంద్రబాబు అండ్‌ ముఠా ఈ యాక్ట్‌పై అత్యంత దిగజారుడు రాజకీయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటూ జనాన్ని చంద్రబాబు భయపెడుతున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. ఈ బిల్లు సమయంలో అసెంబ్లీలో టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చిందని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని విమర్శించారు.

sajjala Clarifies on Land Title act controversy and targets Chandra Babu and Pawan

నాడు సమర్ధించారు
2019 జులైలో అసెంబ్లీలో టీడీపీ పయ్యావుల కేశవ్‌ మద్దతుగా మాట్లాడారన్నారు. ఈ బిల్లు వచ్చినప్పుడు అసెంబ్లీలో టీడీపీ సభ్యులు 13 మంది ఉన్నారన్నారు. ఈ బిల్లు సమయంలో కౌన్సిల్‌లో నారా లోకేష్ ఉన్నారన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ వచ్చిన తరవాత ప్రభుత్వమే ఆ ప్రాపర్టీకి గ్యారెంటీ అంటూ సజ్జల వెల్లడించారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలు కావాలంటే ముందు భూమి సర్వే పూర్తి కావాలన్నారు.
మోడీ భుత్వంలోని నీతి ఆయోగ్ సిఫారసుతోనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ వచ్చిందన్నారు. చంద్రబాబు దివాళా తీశారని.. అందుకే విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ చెత్త అని మోడీ, అమిత్ షాతో చెప్పించాలని ఆయన సవాల్ విసిరారు.

నిధులు అందిస్తాం
బాలకృష్ణ వైజాగ్‌లో స్థలం కొన్నారు.. చంద్ర బాబు చెప్పే ప్రకారం అది ఆయన ఆస్తి కాదన్నారు. పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి నెలలో ఆస్తి కొన్నారు.. మరి ఆ ఆస్తికి ఏం అయ్యిందంటూ ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ-స్టాంప్‌ కలెక్షన్ 2016-2017 నుంచి మొదలు అయ్యిందని.. అప్పుడు అధికారంలో ఉన్నది చంద్ర బాబు నాయుడు అని ఆయన తెలిపారు. ఈ-స్టాంపింగ్‌ విధానం 24 రాష్ట్రాల్లో కొనసాగుతుందన్నారు. ఈసీ క్లారిఫికేషన్‌ చూస్తే దాని వెనుక ఎవరున్నారో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ నేతల ఫిర్యాదుతోనే డీబీటీ ఆగిపోయిందని విమర్శించారు. ఈసీ క్లారిఫికేషన్‌ ఇస్తే..కోర్డు డైరెక్షన్‌లో విండో ఓపెన్‌లో ఉంది కాబట్టి కొంత చేసే అవకాశం ఉంది. లేదంటే మే 13 తరువాత లబ్ధిదారులకు నగదును అందజేస్తామని సజ్జల స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+