అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుది అనవసర రాద్దాంతం -ఆ ఇద్దరూ కేంద్రాన్ని తప్పుదోవ పట్టించారేమో: ఉద్యోగ నేతలు సైతం.. సజ్జల..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఓటీఎస్ వ్యవహారం పైన కొద్ది రోజులుగా రాష్ట్రంలో రాజకీయంగా అనేక మలుపులు తిరుగుతోంది. ఓటీఎస్‌తో పేదల మెడకు ఉరి వేస్తున్నారని చంద్రబాబు ఆరోపించగా.. ఓటీఎస్‌పై చంద్రబాబు రాద్ధాంతం అవసరం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఓటీఎస్ పేరుతో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం పేదల మెడకు ఉరి వేస్తున్నదని చంద్రబాబు ఆరోపించారు. ఎన్టీఆర్ కట్టించిన ఇళ్లకి ఇప్పుడు డబ్బులు వసూలు చేయడమేంటని చంద్రబాబు నిల‌దీశారు. చంద్రబాబు విమర్శలు అర్థరహితమని సజ్జల కొట్టిపారేసారు.

చంద్రబాబు వ్యాఖ్యలు అర్దరహితం

చంద్రబాబు వ్యాఖ్యలు అర్దరహితం

చంద్రబాబు వడ్డీ మాఫీ చేసిన రోజు కూడా పేదలకు ఇల్లు సొంతం కాలేదని, కానీ నేడు రిజిస్ట్రేషన్ భారం లేకుండా ప్రజలకు సంపూర్ణ హక్కు దక్కుతుందని పేర్కొన్నారు. ఈ పథకం వల్ల పెద్దగా ఆదాయం వచ్చేది ఏమీ లేదని, ఇంత సౌలభ్యం ఉన్న పథకంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 30 లక్షల మందికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సొంతంగా ఇళ్లు కట్టిస్తోందని సజ్జల పేర్కొన్నారు. ఓటీఎస్‌ అంటూ మొసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబు.. తాను అధికారంలో ఉన్నప్పుడు పేదల ఇండ్ల నిర్మాణం కోసం ఏమీ చేయలేదని చెప్పారు.

పేదలకు మేలు చేస్తుంటే

పేదలకు మేలు చేస్తుంటే

30 లక్షల మందికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సొంతంగా ఇళ్లు కట్టిస్తోందని సజ్జల పేర్కొన్నారు. పేదలకు భారీగా మేలు జరుగుతుంటే ఎందుకు ఈ పిలుపని ప్రశ్నించారు. చంద్రాబు వడ్డీ మాఫీ చేసిన రోజు కూడా పేదలకు ఇల్లు సొంతం కాలేదని, కానీ నేడు రిజిస్ట్రేషన్ భారం లేకుండా ప్రజలకు సంపూర్ణ హక్కు దక్కుతుందని పేర్కొన్నారు. ఈ పథకం వల్ల పెద్దగా ఆదాయం వచ్చేది ఏమీ లేదని, ఇంత సౌలభ్యం ఉన్న పథకంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటీఎస్‌పై ఎవరూ బలవంతం పెట్టడం లేదని, స్వచ్చందంగా లబ్ధిదారుల నిర్ణయం మేరకే చేస్తున్నట్లు తెలిపారు.

చంద్రబాబు చెప్పినట్లుగా నడవదు

చంద్రబాబు చెప్పినట్లుగా నడవదు

చంద్రబాబు అనుకున్న ప్రకారమే పాలన నడవాలనుకోవడం ఆయన భ్రమగా పేర్కొన్నారు. ప్రజల్ని కూడా తిట్టడం ఆయనకు అలవాటుగా మారిందన్నారు. ఉద్యోగులు తమకు రావాల్సిన ప్రయోజనాల మీద అడగటం వారి హక్కు గా సజ్జల వ్యాఖ్యానించారు. ఉద్యోగులు తమ ప్రభుత్వంలో భాగమన్నారు. తమ ఆలోచనలను కింది స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత వారిపైన ఉందన్నారు. చంద్రబాబు ఉద్యోగులకు డీఏలు ఇవ్వకపోతే..తాము వచ్చిన తరువాత ఐఆర్ చెల్లించామని గుర్తు చేసారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని రకాల ఉద్యోగులకు రూ 18 వేల కోట్ల మేర వేతనాలు పెంచామని వివరించారు. కొంతమంది నాయకులు మాట్లాడిన మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

ఉద్యోగ నేతలు అలా అయితే రాజకీయాల్లోకి వెళ్లచ్చు

ఉద్యోగ నేతలు అలా అయితే రాజకీయాల్లోకి వెళ్లచ్చు

వాళ్ళు నలుగురే ఉద్యోగులు కాదు కదా అంటూనే... ఒక వేళ వాళ్ళు నిర్ణాయక శక్తి అనుకుంటే రాజకీయాల్లోకి వెళ్లొచ్చు ఉన్న పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి అన్నమయ్య ప్రొజెక్టుపై కనీసం కేంద్ర బృందం పరిశీలనను కూడా తెలుసుకుని మాట్లాడి ఉంటే బాగుండేదని సజ్జల వ్యాఖ్యానించారు. ఆయన పక్కనే ఉన్న టీడీపీ నేతలు ఏమైనా మాట్లాడించారేమోనని సందేహం వ్యక్తం చేసారు. కొన్ని తరాలుగా అక్కడ ఇంత స్థాయి వరద రాలేదని.. . ఏమి జరిగిందో అక్కడి ప్రజలకు తెలుసన్నారు. అందుకే ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని సజ్జల చెప్పుకొచ్చారు.

English summary
AP Govt Advisor Sjjala syas OTS in not mandatory, Chandra Babu using this scheme for political game. Sajjala stated Employees is part of Govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X