కౌంటింగ్ వేళ వైసీపీలో కీలక పరిణామాలు - బిగ్ అలర్ట్...!!

ఏపీలో ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీలు తుది అంచనాలకు వస్తున్నాయి. గెలుపు పైన ప్రధాన పార్టీలు ధీమాగా కనిపిస్తున్నా..లోలోపల టెన్షన్ పడుతున్నాయి. జగన్ గెలుపు పైన ఇప్పటికే తన అంచనాలను వెల్లడించారు. చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చారు. ఇక..ఇదే సమయంలో కౌంటింగ్ సమీపిస్తున్న వేళ వైసీపీ అభ్యర్దులను అప్రమత్తం చేసింది. వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

అప్రమత్తం కావాలి
కౌంటింగ్ వేళ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్దులందరూ అప్రమత్తంగా ఉండాల‌ని, ఎక్కడా ఏమరుపాటు పనికిరాదని పార్టీ అభ్యర్దులను వైసీపీ నాయకత్వం అప్రమత్తం చేసింది. అధికారయంత్రాంగం పై అనుమానాలు ఉన్ననేపధ్యంలో అందరూ ప్రజాస్వామ్యయుతంగా కౌంటింగ్ జరిగేలా వ్యవహరించాల‌ని వైసీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రజల ఆదరాభిమానాలతో వైయస్ఆర్‌సీపీ తిరిగి విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేసారు.అందరూ మరింత అప్రమత్తంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అభ్యర్దులకు ఏమైనా గైడెన్స్ అవసరమైతే వారు సందేహాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు.

Sajjala latest Directions for Party candidates leads for new disucssion ahead counting in the party

టీడీపీ పై అనుమానాలు
కౌంటింగ్ ఏజంట్లకు సంబంధించి లిస్ట్ 31 వతేదీ లోగా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆలోగా వైయస్సార్ సిపికి అంకితభావంతో పనిచేసే కార్యకర్తలను కౌంటింగ్ ఏజంట్లుగా నియమించుకోవాలన్నారు. వారికి కౌటింగ్ కు సంబంధించి నియమనిబంధనలు క్షుణ్ణంగా తెలుసుకుని అధికారులతో వాటిని విడమరచి చెప్పగలిగేలా ఉండేవారిని ఎంపిక చేసుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలోగాని...ఇతర అంశాలలో ఈసి గైడ్ లైన్స్ కు భిన్నంగా ఆదేశాలు కూడా ఇవ్వమని అడుగుతూ ఈసిని అప్రోచ్ అవుతున్నారని చెప్పారు.ఎలాగూ ఓడిపోతున్నామని కావచ్చు టిడిపి వాళ్ళు కౌంటింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోందని సజ్జల వివరించారు.

Sajjala latest Directions for Party candidates leads for new disucssion ahead counting in the party

అనుకూలంగా మలిచుకొనేలా
అవసరమైతే కౌంటింగ్ ప్రాంతాలలో పరిస్దితులను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయని కనిపిస్తోందిని అప్రమత్తం చేసారు. పోలింగ్ సమయంలో మన పార్టీ కార్యకర్తలు,నేతలు చాలాబాగా చేయగలిగారని...అందుకే మనం విజయం సాధించబోతున్నామని సజ్జల ధీమా వ్యక్తం చేసారు. కౌంటింగ్ అనేది సీరియస్ ఇష్యూగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని స్పష్టం చేసారు. ప్రధానంగా కౌంటింగ్ ఏజంట్ల నియామకం ఈ రెండు రోజులలో పూర్తి చేయాలన్నారు. ఫైనల్ గా డిక్లరేషన్ తీసుకునేవరకు ప్రతి క్షణం,ప్రతినిముషం అప్రమత్తంగా ఉండాలన్నారు. జగన్ పారదర్శకమైన పాలన తిరిగి మన పార్టీని గెలిపించబోతోంద‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+