సజ్జలకి రూట్ క్లియర్ చేసిన సాయిరెడ్డి - జగన్ తాజా నిర్ణయంతో..!!

వైసీపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. 2024 ఎన్నికల్లో ఓటమి తరువాత కీలక పరిణా మాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటోంది. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం పై మాజీ సీఎం జగన్ పోరుబాటకు సిద్దం అయ్యారు. పార్టీ లో ఢిల్లీ టు తాడేపల్లి వరకు అన్ని వ్యవహారాలు చక్కబెట్టే సాయిరెడ్డి వైసీపీ వీడారు. దీంతో, ఇప్పుడు సాయిరెడ్డి బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే చర్చ మొదలైంది. కాగా, పార్టీలో మరో ముఖ్య నేత సజ్జల తిరిగి యాక్టివ్ అయ్యారు. జగన్ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు.

కీలక మార్పులు
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతోంది. అటు వైపీపీ ముఖ్య నేతలు వరుసగా కేసుల్లో చిక్కుకుంటున్నారు. పలువురు జైల్లో ఉన్నారు. జగన్ ఏడాది కాలంగా పరామర్శలు.. పార్టీ నేతలతో సమావేశాలకే పరిమితం అయ్యారు. వారంలో మూడు రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటూ.. మిగిలిన రోజులు బెంగళూరుకు పరిమితం అవుతున్నారు. కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని జగన్ పదే పదే చెబుతున్నారు. ఇదే సమయంలో పలువురు నేతలు పార్టీ వీడారు. జగన్ తరువాత స్థానంలో పార్టీలో కీలకంగా వ్యవహరించిన సాయిరెడ్డి పార్టీ వీడిన తరు వాత అనేక అంశాలు తెర మీదకు వచ్చాయి. ఢిల్లీ టు తాడేపల్లి అనుసంధానం, పార్టీలో సమస్యల వేళ సాయిరెడ్డి ట్రబుల్ షూటర్ గా వ్యవహరించారు.

sajjala-new-role-in-ysrcp-in-place-vijaya-sai-reddy-as-jagan-decision

సాయిరెడ్డి నిర్ణయంతో
సాయిరెడ్డి పార్టీ వీడటంతో ఇప్పుడు ఢిల్లీలో ఎవరు వ్యవహారాలు చక్క బెడతారనే చర్చ పార్టీలో మొదలైంది. కాగా, పార్టీ ఓటమి తరువాత కొందరు ముఖ్య నేతలు ఓటమికి సజ్జల, ధనుంజయ రెడ్డి వంటి వారు ప్రధాన కారణమని విమర్శలు చేసారు. సజ్జల సైతం ఎన్నికల ఫలితాల తరువాత మౌనంగానే ఉంటున్నారు. పలువురు నేతలు కేసులు ఎదుర్కొంటున్నా.. ముందస్తు బెయిల్ మీద ఉన్న సజ్జల పార్టీ అంతర్గత సమావేశాలను పర్యవేక్షిస్తున్నారు. సాయిరెడ్డి ఆరోపించిన జగన్ కోటరీ లో అధికారంలో ఉన్న సమయంలో పట్టు కొనసాగించిన సజ్జల.. ఇప్పుడు తిరిగి యాక్టివ్ అయ్యారు. సాయిరెడ్డి ఆరోపణల వేళ సుబ్బారెడ్డి స్పందించినా.. ఎక్కడా సజ్జల తన అభిప్రాయం వెల్లడించలేదు. ఇప్పుడు పార్టీ వ్యవహారాల పర్యవేక్షణలో గతంలో వలే తిరిగి సజ్జల యాక్టివ్ కావటంలో పార్టీలో ఆసక్తి కరంగా మారింది.

కొత్త బాధ్యతల్లోకి
సజ్జల ను పార్టీ అంతర్గత వ్యవహారాలకే పరిమితం చేయాలనేది ముఖ్య నేతల డిమాండ్ గా పలు సందర్భాల్లో స్పష్టమైంది. అయితే, ఇప్పుడు సజ్జల మినహా పార్టీ నిర్వహణలో ఆ స్థాయిలో జగన్ కు మరో ప్రత్యామ్నాయం కనిపించటం లేదు. సాయిరెడ్డి పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ గా తనకు అప్పగించిన పాత్రకే సుబ్బారెడ్డి పరిమితం అవుతున్నారు. ఇతర ముఖ్య నేతలు కేసుల్లో చిక్కుకుంటున్నారు. జగన్ సూచన మేరకు నెల్లూరు జైలులో కాకాణి తో సజ్జల ములాఖత్ అయ్యారు. గుంటూరు జైలులో నందిగం సురేశ్ ను పరామర్శించారు. రెడ్ బుక్ గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. జిల్లాల నుంచి వచ్చే నేతలు సజ్జలను కలుస్తున్నారు. దీంతో, కోటరీ పేరుతో బయటకు వెళ్లిన సాయిరెడ్డి ఇటు సజ్జలకు లైన్ క్లియర్ చేసారు. జగన్ కు సజ్జల కే ప్రధాన బాధ్యతలు అప్పగించే పరిస్థితి కల్పించారని పార్టీలో చర్చ సాగుతోంది. మరి.. జగన్ త్వరలోనే పార్టీ కీలక బాధ్యతల్లో మార్పులు చేస్తారనే ప్రచారం వేళ.. ఎవరికి ఏ అవకాశం కల్పిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+