ఆ ఫీడ్ బ్యాక్ తో వైసీసీకి కొత్త ఊపు..!!

ఈ నెల 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి. దీన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాల‌ని వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. నిర్ణీత షెడ్యూల్‌లోగా బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం పూర్తిచేయాల‌ని సూచించారు.

ఆదివారం పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కోఆర్డినేషన్‌), పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శులు (కోఆర్డినేషన్‌), ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లతో పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వ‌హించారు.

Sajjala Rama Krishna Reddy hold Teleconference with the YSRCP leaders

బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి మంచి స్పందన వచ్చిందని సజ్జల అన్నారు. ఇదే ఊపుతో నియోజకవర్గం, మండలం, గ్రామస్ధాయి వరకు దీన్ని తీసుకుని వెళ్ళాలని చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమన్వయం చేసుకుంటూ అన్ని చోట్లా దిగ్విజయం చేయాలని సూచించారు.

సుపరిపాలన తొలి అడుగు పేరుతో టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారని, వాళ్లను నిలదీయాలంటే రీకాలింగ్ టీడీపీ మేనిఫెస్టో కార్యక్రమం అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం పూర్తి కావాలని అన్నారు. ప్రస్తుతం మనం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ స్ధాయిలో మన కార్యక్రమం జరుగుతుందని, ఆ తర్వాత మండలస్ధాయిలో ఈ నెల 13 నుంచి 20 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.

ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి ఫీడ్‌ బ్యాక్‌ వచ్చిందని, దీన్ని మరింత ముమ్మరంగా కొనసాగించాలని సజ్జల సూచించారు. అప్పుడే టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిన దారుణ మోసం పట్ల ప్రజల్లో చైతన్యం వస్తుందని, పార్టీ క్యాడర్‌కు కూడా ఇది అదనపు బలం అవుతుందని చెప్పారు.

మండల స్ధాయి తర్వాత జులై 21 నుంచి ఆగష్టు 4 వరకు నాలుగో దశలో గ్రామస్థాయిలో జరుగుతుందని సజ్జల అన్నారు. ఈ లోపు కమిటీల నియామకాలు అన్నీ పూర్తి చేయాలని, పార్టీలో చురుగ్గా పనిచేయాలనుకునే వారిని గుర్తించి కమిటీలలో అవకాశం ఇవ్వాలని చెప్పారు.

పార్టీ కేంద్ర కార్యాలయం, సీనియర్ నాయకుల సహకారం ఎప్పటికీ అందుబాటులో ఉంటుందని సజ్జల చెప్పారు. స్ధానిక సంస్ధలలో పదవుల్లో ఉన్న వారిని కూడా గుర్తించి పార్టీ కమిటీలలో ప్రాధాన్యమివ్వాలని నియోజకవర్గ నాయకులకు ఆయన సూచించారు. గ్రామ కమిటీల నియామకం పూర్తవగానే బూత్‌ కమిటీలపై దృష్టి పెట్టాలని చెప్పారు.

అందరి డేటా, ప్రొఫైల్‌ అంతా కూడా సెంట్రల్‌ ఆఫీస్‌ నెట్‌వర్క్‌కు అనుసంధానించాలని, పార్టీ కార్యక్రమాలను సక్సెస్‌ చేయాలంటే అన్ని స్ధాయిలలోని నాయకులు చిత్తశుద్దిగా పనిచేసినప్పుడే విజయవంతం అవుతాయని అన్నారు. గ్రామ కమిటీలు కూడా ఆగస్టు నాటికి పూర్తవ్వాలని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+