ఆ విషయంలో టీడీపీ సక్సెస్- అంగీకరించిన సజ్జల-భువనేశ్వరి ఆరోపణలపై క్లారిటీ..!

ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ఆయన సొంత పార్టీ నేతలు కొద్దిరోజులుగా చేస్తున్న నిరసనలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ ప్రజాజీవితానికి ఇబ్బంది కలిగేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని సజ్జల ఆరోపించారు. జరిగిన అవినీతిపై చర్చ లేకుండా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ విషయంలో టీడీపీ కాస్త సక్సెస్ అయినట్లు కనిపిస్తుందోన్నారు.

రాష్ట్రంలో ఓ పార్టీ అధినేత కుంభకోణానికి పాల్పడ్డాడని, దీనికి ప్రభుత్వం మానవత్వం తో వ్యవహరించడం లేదని ప్రచారం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. సంపాదించడం కోసమే సీఎం అయినట్లు చంద్రబాబు వ్యవహరించారన్నారు. 240 కోట్లు షెల్ కంపెనీకి తరలించి తనకు మళ్లించుకున్నాడన్నారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పాత్ర నేరుగా ఉందని ఆధారాలతో సహా ఉందని సజ్జల గుర్తుచేశారు. చంద్రబాబు మాజీ పీఎస్ వస్తే అంతా బయట పడుతుందన్నారు.

చంద్రబాబును ఈ కేసులో తాము అక్రమంగా ఇరికించలేదని సజ్జల తెలిపారు. తప్పు చేసినట్లు కోర్టు నమ్మినందునే జ్యుడీషియల్ కస్టడీకి పంపించారన్నారు. రిమాండ్ లో ఉన్న ఖైదీ హెల్త్ రిపోర్ట్స్ రోజూ ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు.చంద్రబాబు కు ప్రతి రోజూ చెకప్ చేసి రిపోర్ట్స్ కోర్టుకు పంపిస్తున్నారన్నారు. చంద్రబాబు ను ఆయన కుటుంబసభ్యులే బట్టలిప్పి బయట నిలబెడుతున్నారని తెలిపారు.

sajjala ramakrishna reddy slams tdp for publicity stunts to cover Chandrababu corruption

ఇవాళ గవర్నర్ ను కలుస్తారు, రేపు రాష్ట్రపతి దగ్గరకూ వెళ్తారని టీడీపీ నేతల్ని ఉద్దేశించి సజ్జల ఎద్దేవా చేశారు. భువనేశ్వరిని కలవడానికి వెళ్తే ఎందుకు అడ్డుకుంటామన్నారు. ఎక్కువమంది వస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందనే అడ్డుకుంటారన్నారు.
చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడని ప్రజల్లోకి తీసుకెళ్లడం తమకూ ఇబ్బందిగా మారుతుందన్నారు. దేశంలో ఎవరికీ లేని హక్కు దొంగల ముఠాకు ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. సీఐడీ అధికారుల కాల్ డేటా ఎందుకు అడుగుతున్నారని టీడీపీ నేతల్ని సజ్జల నిలదీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+