జగన్ చెప్పింది నిజమే.. చంద్రబాబు సవాల్ కు సజ్జల ఘాటు కౌంటర్..!

ఏపీలో వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభల్లో నాలుగోది అయిన రాప్తాడు సభలో నిన్న సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలయ్యాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై విపక్ష నేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. 99 శాతం హామీలు ఎక్కడ అమలయ్యాయో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. దీనిపై సీఎం జగన్ స్పందించలేదు. కానీ వైసీపీలో ఆయన తర్వాత నంబర్ టూగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

చంద్రబాబు సవాల్ పై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. చర్చలు అసెంబ్లీలో జరుగుతాయని, చంద్రబాబు వాటిని వదిలిపెట్టి బయట సవాళ్లు విసురుతున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు సత్తా ఉంటే తన ప్రభుత్వం లో ఏం చేశాడో చెప్పాలన్నారు. కారు కూతలు ఎందుకు పట్టించుకోవడం అని జగన్ వదిలేశారన్నారు. అసలు మ్యానిఫెస్టోలో ఏం చెప్పారు, ఏం అమలు చేశామన్నది ముఖ్యమని సజ్జల తెలిపారు.

sajjala ramakrishna reddy strong counter to chandrababus challenge, says jagan take it light

రాష్ట్రంలో మద్య నిషేధం కూడా దశల వారీగా చేస్తామని తాము చెప్పామన్నారు. 99శాతం మ్యానిఫెస్టో పూర్తి అయిందని గర్వంగా చెప్పుకుంటున్నామని సజ్జల తెలిపారు. జగన్ పాలనలో ఏం ఉన్నాయి, ఏం అబద్ధాలనేది చెప్తే చర్చలకు వస్తామన్నారు. 50 రోజుల్లో అన్ని తేలిపోతాయన్నారు. ఇందుకోసం ఇంత హంగామా ఎందుకని ప్రశ్నించారు. కౌంట్ డౌన్ మొదలయిందని, ఇక 50 రోజుల్లో ప్రజలు నిర్ణయం తీసుకుంటారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+