సినీఫక్కీలో సాక్షి సిబ్బంది నుండి 32 లక్షలు దోపిడీ

Sakshi staff robbed in Chittoor district
తిరుపతి: చిత్తూరు జిల్లా రేణిగుంటలో శనివారం జరిగిన దారి దోపిడీ కలకలం సృష్టించింది. సినీ ఫక్కీలో ఈ దారి దోపిడీ జరిగింది. దుండగులు సాక్షి దినపత్రిక సిబ్బంది నుంచి 32 లక్షల రూపాయలను దోచుకుని వెళ్లారు. ఈ సంఘటనపై సాక్షి సిబ్బంది ఫిర్యాదు మేరకు గాడులమండ్యం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి - రేణిగుంట సాక్షి యూనిట్ కార్యాలయం నుంచి అకౌంటెంట్లు చంద్రశేఖర్, విజయకుమార్ రెడ్డి డబ్బును సంచుల్లో తీసుకుని ఎస్‌బిఐలో జమ చేయడానికి బయలుదేరారు. సాక్షి సిబ్బంది ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఓ స్కార్పియో వాహనం అనుసరించి ఢీకొట్టింది.

స్పార్పియో ఢీకొట్టడంతో సాక్షి ఉద్యోగులు ఇద్దరు కిందపడిపోయారు. ప్రమాదంలో వీరిద్దరికీ గాయాలయ్యాయి. అదే సమయంలో వారి వెనకాలే ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చి సాక్షి అకౌంటెంట్లు డబ్బులు తీసుకుని వెళ్తున బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు.

ఈ సంఘటన ముందు వేసుకున్న ప్రణాళిక ప్రకారమే జరిగిందా, యాదృచ్ఛికంగా జరిగిందా అనే విషయాలపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+