రావణ మినిస్టర్స్, తూకమేసి జగన్, కెసిఆర్‌కు(పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర జిల్లాలో ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. పలు జిల్లాలో వివిధ రూపాల్లో సమైక్యవాదులు మంగళవారం తమ ఆందోళనలు కొనసాగించారు. రాస్తారోకోలు, మానవహారాలు, లక్షగళ గర్జనతో తమ నిరసనను తెలియజేశారు.
తిరుపతి, విశాఖ, రాజమండ్రి, శ్రీకాకుళం, ఏలూరు తదితర ప్రాంతాల్లో సమైక్యవాదులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్ర జౌళీ శాఖ మంత్రి కావూరి సాంబశివ రావు ఇంటి వద్ద నిన్న ఉద్రిక్తత ఏర్పడింది. దీనికి సంబంధించి టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
మరోవైపు సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు విభజన ప్రక్రియ ముందుకు సాగదని భావిస్తున్నారు. ఈ రోజు ఢిల్లీలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వీరప్ప మొయిలీతో భేటీ అయ్యారు. ఆంటోని కమిటీ నివేదిక ఇచ్చే వరకు విభజన ముందుకు కదలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

తిరుపతిలో
సీమాంధ్రలో విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేస్తున్నదృశ్యం.

విశాఖలో
విశాఖపట్నంలో తెలుగు దేశం పార్టీ అధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నిలబడతామంటూ చెయ్యెత్తి చెబుతున్న ఆ పార్టీ నాయకులు.

ఉపాధ్యాయులు
సమైక్యాంధ్ర ఉద్యమం వర్ధిల్లాలి అంటూ విశాఖ నగర ఉపాధ్యాయ సంఘాల ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ తీస్తున్న దృశ్యం.

న్యాయవాదులు
తెలంగాణ వద్దు సమైక్యాంధ్ర ముద్దు అంటూ విశాఖ నగర న్యాయ శాఖ ఉద్యోగుల సంఘాల ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ తీస్తున్న దృశ్యం.

సోనియా, కెసిఆర్, రాహుల్
విశాఖ టిడిపి ఆధ్వర్యంలో తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తూకం వేసి ఇస్తున్నట్లుగా నిరసన తెలిపిన దృశ్యం.

జై సమైక్యాంధ్ర
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తూకం వేసి జగన్, కెసిఆర్‌లకు రాష్ట్రం పంచుతున్నట్లుగా విశాఖ టిడిపి ఏర్పాటు చేసిన ప్లెక్సీ.

కెసిఆర్
విశాఖ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వైఖరి పట్ల వినూత్న నిరసన దృశ్యం.

సోనియా అభయం!
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరుల వద్ద రాష్ట్ర మంత్రులు మోకరిల్లారంటూ నిరసన తెలుపుతున్న దృశ్యం.

కెసిఆర్
విశాఖ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వైఖరి పట్ల వినూత్న నిరసన దృశ్యం.

సీమాంధ్ర కేంద్రమంత్రులు
కేంద్రమంత్రులమైన మేము రాష్ట్రానికి, సమైక్యాంధ్ర ఉద్యమానికి, సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేశామంటూ.. కేంద్రమంత్రులు చెబుతున్నట్లుగా ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

సోనియా
సోనియమ్మ మాట సీమాంధ్ర కేంద్రమంత్రుల బాట అంటూ ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన సమైక్యవాదులు. సోనియా ఓట్లు, సీట్ల లెక్కల కోసం రాష్ట్రాన్ని విభజించారంటూ నిరసన తెలిపారు.

రావణ 'మంత్రులు'
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని రాక్షసిగా, కేంద్రమంత్రులు చిరంజీవి, పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు తదితరులను రాక్షసులుగా చిత్రీకరిస్తూ నిరసన తెలిపారు.












Click it and Unblock the Notifications