వైసీపీలో మరో బిగ్ వికెట్ డౌన్.. జగన్ సన్నిహితుడు గుడ్ బై

ఉమ్మడి కృష్ణాజిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో సామినేని శుక్రవారం జగ్గయ్యపేటలో అభిమానులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.పార్టీలో తనకు అన్యాయం జరిగిందని, సరైన గుర్తింపు రాలేదని సామినేని అన్నారు. తన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికే రాజీనామా చేసినట్లు తెలిపారు. తనతో కలిసొచ్చే వారిని జనసేనలోకి ఆహ్వానించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశానని ఆయన తెలిపారు. కాగా ఎల్లుండి ఆయన జనసేన పార్టీలో చేరనున్నారు.

సామినేని ఉదయభాను గతంలో కాంగ్రెస్‌లో కొనసాగారు. ఆయన 1999, 2004లలో రెండు సార్లు వరసగా జగ్గయ్యపేట నుంచి గెలిచారు. వైఎస్ఆర్ మరణం తర్వాత సామినేని ఉదయభాను వైసీపీలో చేరారు. జగన్ ఆయనకు 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు.అయితే 2014లో ఓడిన ఉదయభాను 2019లో గెలిచారు. పార్టీ కూడా అధికారంలోకి రావడంతో మంత్రి పదవిపై సామినేని ఆశలు పెట్టుకున్నారు. కానీ జగన్ ఆయనకు విప్ పదవితో సరిపెట్టారు. అయితే రెండోసారి మంత్రివర్గ విస్తరణ సమయంలో కూడా సామినేనికి నిరాశే ఎదురైంది.

Samineni Udayabhanu resigned from YCP

మంత్రి దక్కకపోవడంతో సామినేని బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. కేవలం 15 వేల ఓట్ల తేడాతోనే ఆయనను అపజయం పలకరించింది. పార్టీ కూడా ఓడిపోవడంతో ఆయన సైలెంట్ అయ్యారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు సైతం సామినేని దూరంగా ఉంటున్నారు. ఈక్రమంలోనే సామినేని ఉదయభాను రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు.మెగాస్టార్ చిరంజీవితో తనకున్న కుటుంబ నేపథ్యం ద్వారా సామినేని జనసేనలో చేరేందుకు రాయబారం చేసినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+