భీమ్‌రెడ్డి జాబితాలో సినీ హీరో - రూ.3 కోట్ల అడ్వాన్స్, అగ్రిమెంట్..!?
డీఎస్పీ భీమ్‌రెడ్డి వ్యవహారంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. భీమ్‌రెడ్డి తన డైరీలో.. తనకు ఎవరు ఎంత ఇవ్వాలి, తాను ఎంత మందికి ఎంత మొత్తం ఇవ్వాలి అన్న వివరాలను ఒక పద్ధతిలో రాసుకున్నారన్న విషయాలను ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్టులో న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. కాగా, ఈ వ్యవహారంలో ఓ సినీ హీరో పేరు తెరపైకి వచ్చింది. దాదాపు రూ.3 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారని వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వ్యవహారంలో బయటకు వస్తున్న అంశాలు సంచలనంగా మారుతున్నాయి.
డీఎస్పీ భీమ్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో ఆసక్తి కర అంశాలు బయటకు వస్తున్నాయి. కాగా, ఆసక్తి కరంగా డీఎస్పీ భీమ్‌రెడ్డి వ్యవహారంలో ఓ సినీ హీరో పేరు తెరపైకి వచ్చింది. కుటుంబ కథాచిత్రాల హీరోగా పేరున్న ఆయన.. మణికొండలోని ఒక ఆస్తి అమ్మకానికి సంబంధించి భీమ్‌రెడ్డితో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు దాదాపు రూ.3 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారని, మిగిలిన మొత్తం వచ్చే సమయంలో ఏసీబీ దాడి జరగడంతో ఆయన ఆస్తి అమ్మకం వివాదంలో పడిందని ప్రచారం సాగుతోంది. ఆ హీరోకు అందిన రూ.3 కోట్ల వివరాలు భీమ్‌రెడ్డి ఇంట్లో స్వాధీనం చేసుకున్న డైరీలో నమోదైనట్లు తెలిసింది. దాదాపు 60కి పైగా స్థిరాస్తుల క్రయవిక్రయా ల కు సంబంధించిన డాక్యుమెంట్లను భీమ్‌రెడ్డి ఇంటినుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, భీమ్‌రెడ్డి తన ఆస్తులను బినామీల పేరిట పెట్టే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు విచారణలో అధికారులు గుర్తించారు.

పూర్తి వివరాలు సేకరిస్తున్న విచారణాధికారులు
భీమ్ రెడ్డి ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఎవరి పేరిట ఆస్తిని రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఆ బినామీ నుంచి క్యాన్సిలేషన్ డీడ్ ముందే రాయించి పెట్టుకున్నట్లుగా గుర్తించారు. సోదాల్లో భాగంగా ఇలాంటి క్యాన్సిలేషన్ డీడ్లు భీమ్‌రెడ్డి ఇంట్లో దాదాపు 30కి పైగా దొరికినట్లు తెలుస్తోంది. అదే విధంగా.. ప్రస్తుతం తాను ఉంటున్న విల్లాను ఎలా కొనుగోలు చేశారన్న ప్రశ్నకు భీమ్‌రెడ్డి సమాధానం ఇవ్వలేదని ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో రెండు మెమొరీ కార్డులు, రెండు లాకర్లకు సంబంధించిన వివరాలు, పది బ్యాంకు ఖాతాల వివరాలను గుర్తించామని తెలిపారు. భీమ్‌రెడ్డి బినామీ ఆస్తుల వివరాలు మరిన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, ఆయన ఆ స్థాయిలో ఆస్తుల సమీకరణకు నిధులు ఎక్కడ నుంచి వచ్చాయి.. ఎవరెవరితో లావా దేవీలు నడిపారనే అంశం పైన అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. దీంతో.. ఈ విచారణ తరువాత కీలక అంశాలు.. పాత్రధారుల అంశంపైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications